అమెరికా సైనిక స్థావరాల్లో ఫ్రీజర్లు హ్యాక్?
అమెరికాలోని సైనిక స్థావరాల్లో ఫ్రీజర్లు, రిఫ్రిజరేటర్లు అకస్మాత్తుగా పనిచేయకపోవడం, వాటిలో నిల్వ చేసిన ఆహారపదార్థాలు పాడైపోవడం కలకలం రేపింది. దీని వెనుక సైబర్ దాడి ఉందా? అన్న కోణంలో అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) దర్యాప్తు చేపట్టింది.
- రాత్రికి రాత్రే పాడైపోయిన ఆహార పదార్థాలు
- సైబర్ దాడి కోణంలో అమెరికా రక్షణ శాఖ దర్యాప్తు
వాషింగ్టన్ : అమెరికాలోని సైనిక స్థావరాల్లో ఫ్రీజర్లు, రిఫ్రిజరేటర్లు అకస్మాత్తుగా పనిచేయకపోవడం, వాటిలో నిల్వ చేసిన ఆహారపదార్థాలు పాడైపోవడం కలకలం రేపింది. దీని వెనుక సైబర్ దాడి ఉందా? అన్న కోణంలో అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) దర్యాప్తు చేపట్టింది. ఈ ఏడాది ఆగస్టులో కనీసం ఆరు సైనిక స్థావరాల్లోని ఆహార విక్రయ కేంద్రాల్లో ఈ సమస్య తలెత్తింది. ఫ్రీజర్లను సాధారణంగా ఆపివేయడమే కాకుండా, వాటిని డీఫ్రాస్ట్ మోడ్‌లోకి మార్చి లోపలి ఉష్ణోగ్రతలను పెంచినట్టు అనుమానిస్తున్నారు. అరిజోనాలోని ఫోర్ట్ హువాచుకా సైనిక స్థావరంలో ఆగస్టు 26న ఫ్రీజర్లు డీఫ్రాస్ట్ మోడ్‌లోకి మారడంతో అందులోని ఘనీభవించిన ఆహార పదార్థాలన్నీ పాడైపోయినట్టు అధికారులు వెల్లడించారు.
సాధారణంగా ఫ్రీజర్లలో మంచు పేరుకుపోకుండా తొలగించేందుకు ఉపయోగించే ఈ ప్రక్రియలో ఉష్ణోగ్రత పెరగడంతో ఆహారం నిల్వ ఉండే పరిస్థితి లేకుండా పోయింది. కాలిఫోర్నియాలోని ఫోర్ట్ ఇర్విన్, ట్రావిస్ ఎయిర్‌ఫోర్స్ బేస్ సహా ఆరు సైనిక స్థావరాల్లో ఇలాంటి సమస్యలు నమోదయ్యాయి. ఈ స్థావరాల్లో సైనికులు, వారి కుటుంబాలకు నిత్యావసరాలు, ఆహార పదార్థాలు విక్రయించే ప్రత్యేక దుకాణాలు ఉంటాయి. వీటిలో ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో పెద్ద మొత్తంలో ఆహారం వృథా అయింది. ఈ ఘటనలపై దర్యాప్తు చేయడానికి అమెరికా సైబర్ కమాండ్ కూడా రంగంలోకి దిగింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

