సర్కార్ నిర్లక్ష్యంతోనే కరువు
తెలంగాణలో ప్రస్తుత కరువును ఎల్ నినోకు ఆపాదించడం దృష్టి మళ్లింపు చర్యలాగానే భావించాల్సి ఉంటుందని రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు.
- ఎల్ నినో అనడం దృష్టి మళ్లింపే
- కాళేశ్వరం పంపింగ్‌ను ఆపడం రాజకీయ కక్షే
- పశువుల మేతగా పంటలు
- తొమ్మిది నెలలుగా కేంద్ర సంస్థలు హెచ్చరించినా రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యం
- గోదావరిలో 20 వేల క్యూసెక్కుల వృథా.. వాడుకోలేని దుస్థితి
- ‘తెలంగాణలో కరువు ఎందుకు’ అన్న అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు
ఖైరతాబాద్, అక్టోబర్ 30: తెలంగాణలో ప్రస్తుత కరువును ఎల్ నినోకు ఆపాదించడం దృష్టి మళ్లింపు చర్యలాగానే భావించాల్సి ఉంటుందని రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలంగాణ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఫోరం’ ఆధ్వర్యంలో ‘తెలంగాణలో కరువు ఎందుకు-ఎల్ నినో’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.
పాత్రికేయుడు శివారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, సీపీఐ నాయకురాలు పశ్య పద్మ, నీటి పారుదల శాఖ మాజీ ఇంజినీర్లు వెంకటేశం, రామ్‌సింగ్, దామోదర్‌రెడ్డి, బుచ్చన్న, రమణ, విజయ్ తదితరులు హాజరై ప్రసంగించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఏర్పడ్డ కరువు అని స్పష్టంచేశారు. అఖిలపక్ష సమావేశానికి ముందే విద్యుతు, నీరు ఇవ్వలేమని, పంటలు వేయొద్దని ప్రభు త్వం ప్రకటించడం తప్పడు చర్య అని వారు మండిపడ్డారు.
కర్ణాటక నుంచి ఒక్క టీఎంసీ కూడా తెప్పించలేదు
జూరాలకు కర్ణాటక నుంచి నీరు వస్తుందన్న ప్రచారం ఫలించలేదని, ఒక్క టీఎంసీని కూడా తీసుకొనిరాలేక పోయారని వక్తలు మండిపడ్డారు. కేంద్రం సంస్థలు, వాతావరణ నిపుణులు తొమ్మిది నెలలుగా హెచ్చరించినా రేవంత్ సర్కార్ చర్యలు తీసుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించిందని దుయ్యబట్టారు. ఇదే సమయంలో ఇతర రాష్ట్రలు నీటిని సంరక్షించుకోవడం, విద్యుత్తు ఒప్పందాలు, సౌర విద్యుత్తు ఉత్పత్తి పెంపు వంటి చర్యలు చేపట్టాయని వివరించారు. మొత్తంగా మందస్తు చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.
గోదావరిలో 20 వేల క్యూసెక్కుల నీరు వృథాగా పోతున్నా వినియోగించుకోలేని దుస్థితికి తీసుకొచ్చారని, దేవాదుల ప్రాజెక్టును పూర్తి సామర్థ్యంతో నడుపకపోవడంతో వరంగల్ ప్రాంతం కరువు బారిన పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జలాలపై మంత్రి వ్యాఖ్యలు తెలంగాణ ప్రయోజనాలకు నష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. నీటి పారుదల ఇంజినీర్లు చెప్తున్న లెక్కలు, మంత్రులు చెప్తున్న మాటలు విరుద్ధంగా ఉన్నాయని తప్పుబట్టారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సంరక్షించడంతోపాటు ఎత్తిపోతల పథకాలు, కల్వకర్తి వంటి ప్రాజెక్టులను సక్రమంగా వినియోగిస్తే కరువు ప్రభావాన్ని తగ్గించవచ్చునని సూచించారు.
జవాబుదారీలేని ప్రభుత్వం: సుధీర్‌రెడ్డి
తెలంగాణలో 17% మాత్రమే వర్షాభావం ఉన్నదని, అది ఒక్కటే చెరువులు, బోర్ల ఎండటానికి కారణం కాదని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వివరించారు. జవాబుదారీతనం లేని ప్రభుత్వం ఎలాంటి చర్యలపై దృష్టి పెట్టకుండా కరువును ఎల్ నినోకు ఆపాదిస్తున్నదని మండిపడ్డారు. కాళేశ్వరం పంపింగ్‌ను ఆపడం ముమ్మాటికి రాజకీయ కక్షేనని దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాను మరచి మాట్లాడుతున్నారని, పాలన చేతకాక ప్రతిపక్ష నేతలను దూషిస్తూ కాలం వెళ్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్తు ఖర్చుకు భయపడి పంపింగ్‌ను నిలపివేస్తే, హైదరాబాద్ నగరంలో తీవ్ర నీటిఎద్దడి ఏర్పడి ప్రజా జీవితం అస్తవ్యస్తం అవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. విద్యుత్తు ఖర్చులు ఎక్కువైనా పంపింగ్ చేసి చెరువులు నింపి హైదరాబాద్‌కు తాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

