e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News టిమ్స్ సేవ‌లు అద్భుతం.. క‌రోనా బాధితులు హ‌ర్షం.. వీడియో

టిమ్స్ సేవ‌లు అద్భుతం.. క‌రోనా బాధితులు హ‌ర్షం.. వీడియో

టిమ్స్ సేవ‌లు అద్భుతం.. క‌రోనా బాధితులు హ‌ర్షం.. వీడియో

హైద‌రాబాద్ : క‌రోనా బాధితుల కోసం ప్ర‌త్యేకంగా రూపుదిద్దుకున్న టిమ్స్ ఆస్ప‌త్రి సేవ‌ల‌పై రోగులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన ఓ ఇద్ద‌రు దంప‌తులు టిమ్స్‌లో చికిత్స అందుకొని కోలుకున్న త‌ర్వాత‌.. అక్క‌డి సేవ‌ల‌ను వివ‌రిస్తూ ఓ వీడియోను చేశారు. ఈ వీడియోను వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ త‌న ట్విట్ట‌ర్ పేజీలో షేర్ చేశారు.


మార్చి 28న హైద‌రాబాద్‌కు చెందిన ర‌మేశ్‌, మంజుల దంప‌తులకు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. దీంతో వారిద్ద‌రూ గ‌చ్చిబౌలిలోని టిమ్స్‌లో చేరారు. క‌రోనా నుంచి పూర్తిగా కోలుకోవ‌డంతో ఏప్రిల్ 4న టిమ్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ సంద‌ర్భంగా వారు ఓ వీడియోను విడుద‌ల చేశారు. టిమ్స్‌లో వైద్య సౌక‌ర్యాలు అద్భుతంగా ఉన్నాయ‌న్నారు. డాక్ట‌ర్లతో పాటు ఇత‌ర సిబ్బంది త‌మ‌కు మ‌నోధైర్యం ఇచ్చార‌ని తెలిపారు. టిమ్స్‌లో రూమ్స్‌, వాతావ‌రణం చాలా బాగుందన్నారు. రోజుకు మూడు సార్లు చెక‌ప్ చేసి మెడిసిన్ ఇస్తున్నార‌ని, అక్క‌డ ప‌ని చేస్తున్న డాక్ట‌ర్ల‌కు హ్యాట్సాఫ్ చెప్పారు ఆ దంప‌తులు.

ఇవి కూడా చ‌ద‌వండి..

జగి‌త్యాల జిల్లా సిరి‌పూ‌ర్‌లో స్వచ్ఛంద లాక్‌‌డౌన్‌
రాష్ట్రంలో మండుతున్న ఎండలు..
పిల్లలు వద్దు! కరోనా వల్ల జననాల రేటులో భారీ తగ్గుదల
కంటైన్‌మెంట్‌ జోన్‌గా జోధ్‌పూర్‌ ఐఐటీ
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
టిమ్స్ సేవ‌లు అద్భుతం.. క‌రోనా బాధితులు హ‌ర్షం.. వీడియో

ట్రెండింగ్‌

Advertisement