Corona Effect : మాల్దీవుల్లోకి భారత పర్యాటకులకు నో ఎంట్రీ
Corona Effet : మాల్దీవుల్లోకి భారత పర్యాటకులకు నో ఎంట్రీ | భారత్‌లో రెండో దశలో కరోనా విజృంభిస్తోంది. దీంతో రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలు దేశాలు భారత్‌పై ఆంక్షలు విధించాయి.

మాలే : భారత్‌లో రెండో దశలో కరోనా విజృంభిస్తోంది. దీంతో రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలు దేశాలు భారత్‌పై ఆంక్షలు విధించాయి. తాజాగా మాల్దీవులు ప్రభుత్వం సైతం కీలకం నిర్ణయం తీసుకుంది. భారత్ సహా దక్షిణ ఆసియా నుంచి వచ్చే పర్యాటకుల వీసాలు తాతాలిక నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 13 నుంచి ఆంక్షలు అమలులోకి వస్తాయని, అన్ని రకాల వీసాలకు వర్తిస్తుందని చెప్పింది. గత 14 రోజుల్లో దక్షిణ ఆసియా దేశాల్లో పర్యటించిన ఇతర దేశాల పర్యాటకులకు సైతం ఈ నిబంధనలు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిషేధం అమలులో ఉంటుందని మాల్దీవులు ఇమ్మిగ్రేషన్ ట్వీట్ చేసింది. ఈ నిషేధంపై మాల్దీవుల్లోని హైకమిషన్ ఆఫ్ ఇండియా స్పందించింది. మాల్దీవులు నిర్ణయం ఇరుదేశాల మధ్య విమాన రాకపోకలపై ప్రభావం చూపే అవకాశం ఉందని, అందువల్ల ఇక్కడ ఉన్న భారతీయులు స్వదేశానికి వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రాయబార కార్యాలయం సూచించింది.
⚠️The temporary suspension of entry to the Maldives for all categories of visa holders from South Asia may impact flights between India & the Maldives.
— India in Maldives (@HCIMaldives) May 12, 2021
⚠️Indian tourists already in the Maldives may make necessary travel arrangements to return to India. https://t.co/I8XyjUmxCA
ఇవికూడా చదవండి..
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
ఆక్సిజన్ అందక నాలుగు గంటల్లో 26 మంది మృతి
18 రాష్ట్రాలకు నేరుగా ‘కొవాగ్జిన్’ సరఫరా : భారత్ బయోటెక్
కరోనా ఇండియన్ వేరియంట్ 44 దేశాల్లో గుర్తింపు : WHO
బాదుడే బాదుడు.. మూడో రోజూ పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
రాష్ట్రంలో అమలులోకి వచ్చిన లాక్డౌన్
కరోనా ఎఫెక్ట్.. 31 రైళ్లు రద్దు చేసిన రైల్వే
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

