వరుసలో 42 శవాలు.. చివరి ఖర్మలకూ తప్పని పాట్లు
కరోనా |

ఘజియాబాద్ : కరోనా మహమ్మారి దేశంలో విలయం సృష్టిస్తోంది. ఓ వైపు వైరస్ వచ్చిన వారికి బతికుండగానే నరకం చూపిస్తుండగా.. మరణించాక సైతం ముప్పు తిప్పలు పెడుతున్నది. పెరుగుతున్న కేసులతో ఓ వైపు బెడ్లు దొరకడం లేదు.. పరిస్థితి విషమించి కొందరు కన్నుమూసినా చివరి ఖర్మలు నిర్వహించేందుకు పడరాని పాట్లు తప్పడం లేదు. పెద్ద ఎత్తున మృతదేహాలు అంత్యక్రియలకు వస్తుండడంతో వసతులు లేక శవాలను వరుసలో పెట్టి, మరికొందరు అంబులెన్సులు, కార్లలో మృతదేహాలను ఉంచి గంటల కొద్దీ నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది.

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని హిండన్ మోక్ష స్థల్ వద్ద హృదయ విదాకరమైన ఘటన చోటు చేసుకుంది. వాటిక వద్ద 42 మృతదేహాలు శుక్రవారం చివరి ఖర్మలకు కోసం నిలిచిపోయాయి. కుటుంబీకులను కోల్పోయి పుట్టెదు దుఃఖంలో ఉన్న వారికి దహన క్రియలకు స్థలం దొరక్కపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శ్మశాన వాటిక పని చేయకపోవడం.. మరో వైపు పెద్ద ఎత్తున మృతదేహాలను వస్తుండడంతో దహన సంస్కారాలకు వినియోగించే కలప ధరలకు రెక్కలు వచ్చాయి.

గురువారం సైతం మోక్ష స్థల్ వద్దకు పెద్ద ఎత్తున మృతదేహాలు రాగా.. దహనం చేసేందుకు రెండు మూడు గంటల సమయం పట్టింది. పలు మృతదేహాలను మరో శ్మశాన వాటికకు పంపగా.. తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చివరకు విద్యుత్ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు అన్ని ప్లాట్‌ఫారమ్‌లు నిండిపోయాయి, అప్పుడు సాల్వేషన్ సైట్ నిర్వహణ టోకెన్లను నిలిపివేసి, కార్యాలయాన్ని మూసివేశారు. గత పది రోజులుగా హిండన్ మోక్ష స్థల్ వద్ద అంత్యక్రియలకు వచ్చే మృతదేహాల సంఖ్య భారీగా పెరిగింది. నిన్న ఒకే రోజు 35 మృతదేహాలకు దహన క్రియలకు రాగా.. ప్లాట్ఫారాలన్నీ నిండిపోయాయి.

ఇవి కూడా చదవండి..
ఈనెల 30 వరకు గురుకులసెట్ దరఖాస్తులు
నీట్-2021వాయిదా
కుంభమేళాలో 5 రోజుల్లో 1700 మందికి కరోనా
చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలను మూసివేసిన ఏఎస్ఐ
రాజస్థాన్‌లో నేటి నుంచి వారాంతపు నైట్ కర్ఫ్యూ
ఢిల్లీపై కరోనా పంజా.. ఒకే బెడ్‌పై ఇద్దరు..
ఏడాదిలో మూడో టీకా అవసరం : ఫైజర్ సీఈఓ
తెలంగాణలో కొత్తగా 3,840 కరోనా కేసులు
కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా, కేంద్ర మాజీ మంత్రి హర్సిమ్రత్ కౌర్‌కు కరోనా
దేశంలో కరోనా విలయం.. 24 గంటల్లో 2లక్షలకుపైగా కేసులు.. 1,185 మంది మృతి
కరోనా సెకండ్ వేవ్‌ను అధిగమించడం పెద్ద సవాలే : కేంద్రమంత్రి
దేశంలోకి త్వరలో కొత్తగా ఎనిమిది బ్యాంకులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

