కారేపల్లి, జూన్ 04 : కారేపల్లి మండల పరిధిలోని గుట్టకిందగుంపు గ్రామంలో రూ.9.85 కోట్లతో నూతనంగా నిర్మించనున్న 15,000 మెట్రిక్ టన్నుల గోడౌన్ నిర్మాణ శంకుస్థాపన పనులకు గురువారం స్థానిక ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ శంకుస్థాపన చేశారు. అంతకుముందు గుట్టకిందగుంపు గ్రామంలో ఎంఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును స్థానిక సర్పంచ్ ఉండం రాఘవులుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సూడా చైర్మన్ పువ్వాల దుర్గాప్రసాద్, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, తాసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు, ఇన్చార్జి ఎంపీడీఓ మల్లెల రవీంద్ర ప్రసాద్, పర్స ట్రస్ట్ చైర్మన్ పట్టాభి రామారావు, మాజీ ఎంపీపీ పగడాల మంజుల పాల్గొన్నారు.