గాంధీనగర్, జూలై 29: బీజేపీ పాలిత గుజరాత్‌లోని ఆయుర్వేద యూనివర్సిటీలో ఒక పరీక్ష పేపరు లీకైనట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ కోర్సుకు చెందిన శల్య తంత్ర-1 (శస్త్రచికిత్స పద్ధతులు) పత్రం లీకైనట్టు పలువురు విద్యార్థులు ఆరోపించారు. దీంతో ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. దీనిపై దర్యాప్తు జరిపి, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. నీట్ పేపర్ లీక్‌పై కాక్రోచ్ జనతా పార్టీ దేశ వ్యాప్త నిరసనకు ఐదు రోజల ముందు గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో ఈ పేపర్ లీక్‌కు సంబంధించి విస్తృతంగా ప్రచారం జరిగింది. ముఖ్యమైన ప్రశ్నలు పేరుతో లీకైన పేపర్‌కు సంబంధించిన ప్రశ్నలు వాట్సాప్‌లో ప్రచారం అయినట్టు గుర్తించారు.