– సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి రమేష్
ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 02 : కాంగ్రెస్ పార్టీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దిగజారుడు రాజకీయాలను మానుకోవాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి రమేష్ అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ సత్యనారాయణపురం జంగాలకాలనీలో అమాయకమైన ప్రజలను మోసం చేయడం సరైనది కాదన్నారు. పార్టీ మండల నాయకుడు తోట పెద్ద వెంకటరెడ్డి అధ్యక్షత జంగాల కాలనీలో జరిగిన కార్యక్రమంలో 25 కుటుంబాల నుండి 50 మంది సిపిఎంలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిపిఎం పార్టీలో అనేక సంవత్సరాలుగా ఉంటున్న పస్తం గోపాల్, యేసు, రేపల్లె వెంకన్న, పస్తం కొండలు, సింగపూర్ జానయ్య, వెంకన్న, రమేష్ తదితరులకు ఇల్లు ఇస్తామని చెప్పి ప్రచారంలో భాగంగా పిలిచి, వారి మెడలో కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలో చేరినట్టుగా ప్రకటించడం అత్యంత దుర్మార్గమైన విషయం అని మండిపడ్డారు. అమాయకమైన ప్రజలను సంక్షేమ పథకాలు ఇస్తామని పిలిచి మెడలో కండువాలు కప్పడం సరైన పద్ధతి కాదన్నారు. ఇలాంటి దిగజాలు రాజకీయాలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు షేక్ బషీరుద్దీన్, పార్టీ డివిజన్ నాయకులు నందిగామ కృష్ణ, తోట నరేష్ రెడ్డి, కార్తీక్, రాజశేఖర్, కుమ్మరి శ్రీనివాస్, ఆంటోనీ పాల్గొన్నారు.