Sheikh Hasina: ప్లాట్ల కేటాయింపు కేసులో షేక్ హసీనాకు పదేళ్ల జైలుశిక్ష
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు పదేళ్ల జైలు శిక్ష ఖరారు చేశారు. ఆమె మేనల్లుడు రద్వాన్ ముజిబ్ సిద్దిక్, మేనకోడళ్లు తులిప్ రిజ్వానా సిద్దిక్, అజ్మినా సిద్దిక్లకు కూడా రెండు వేర్వేరు అవినీతి కేసుల్లో శిక్ష పడింది.
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు పదేళ్ల జైలు శిక్ష ఖరారు చేశారు. ఆమె మేనల్లుడు రద్వాన్ ముజిబ్ సిద్దిక్, మేనకోడళ్లు తులిప్ రిజ్వానా సిద్దిక్, అజ్మినా సిద్దిక్లకు కూడా రెండు వేర్వేరు అవినీతి కేసుల్లో శిక్ష పడింది. రాజుక్ న్యూ టౌన్ ప్రాజెక్టుకు సంబంధం ఉన్న ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో అవినీతి జరిగినట్లు షేక్ హసీనాతో పాటు ఆమె బంధువులపై ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఢాకాలోని కోర్టు-4కు చెందిన ప్రత్యేక జడ్జీ రాబిల్ ఆలమ్ ఇవాళ ఆ కేసులో తీర్పును వెలువరించారు.
ఒక్కొక్క కేసులో అయిదేళ్ల చొప్పున, మొత్తంగా హసీనాకు పదేళ్ల జైలుశిక్షను ఖరారు చేశారు. తులిప్ సిద్ధిక్‌కు నాలుగేళ్లు, ఇక హసీనా మేనకోడళ్లకు ఒక్కొక్కరికి ఏడేళ్ల శిక్షను వేశారు. ఈ కేసులో సరెండర్ అయిన రాజుక్ సభ్యుడు ఖుర్షీద్ ఆలమ్‌కు ఏడాది జైలుశిక్ష విధించారు. నిందితులు అందరికీ లక్ష జరిమానా విధించారు. ఒకవేళ కట్టలేని పక్షంలో అదనంగా ఆర్నెళ్లు జైలు జీవితాన్ని అనుభవించాలి.
హసీనాకు శిక్ష పడిన విషయాన్ని ఏసీసీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తారిక్ ఇస్లామ్ ఖాన్ మనిముల్ హసన్ లిపన్ కన్ఫర్మ్ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rashmika | విజయ్ దేవరకొండ ఇంకా నల్లపూసలు కొనివ్వలేదు.. రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు!
Sambarala Yeti Gattu | ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ డేట్ వివాదం.. నిర్మాతకు ఫోన్ చేసి వార్నింగ్!
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

