Ranji Trophy | రంజీ ట్రోఫీలో యశస్వీ.. కెప్టెన్‌గా శార్ధూల్..!
Ranji Trophy : భారత స్టార్ ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో బరిలోకి దిగుతున్నారు. టీ20 ప్రపంచకప్ స్క్వాడ్‌కు ఎంపికవ్వని ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal), శార్ధూల్ ఠాకూర్ (Shardul Thakur)లు ముంబై జట్టు తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్నారు.
Ranji Trophy : భారత స్టార్ ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో బరిలోకి దిగుతున్నారు. టీ20 ప్రపంచకప్ స్క్వాడ్‌కు ఎంపికవ్వని ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal), శార్ధూల్ ఠాకూర్ (Shardul Thakur)లు ముంబై జట్టు తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్నారు. లార్డ్స్ శార్ధూల్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. యశస్వీ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశముంది. కీలకమైన క్వార్టర్ ఫైనల్ కోసం సోమవారం సెలెక్టర్లు ప్రకటించిన 16 మంది స్క్వాడ్‌లో ఖాన్ బ్రదర్స్ కూడా చోటు దక్కించుకున్నారు.
దేశవాళీ క్రికెట్లో వరల్డ్‌కప్‌తో సమానమైన రంజీ ట్రోఫీని రికార్డు స్థాయిలో 42 సార్లు టైటిల్ గెలుపొందిన ముంబై ఈసారి కూడా గట్టి పోటీనిస్తోంది. క్వార్టర్ ఫైనల్లో ఫిబ్రవరి 6న కర్నాటకతో తలపడనుంది. ఈ మ్యాచ్కోసమని యశస్వీ జైస్వాల్, శార్ధూల్ ఠాకూర్లను స్క్వాడ్‌లోకి తీసుకున్నారు.
🚨 Shardul Thakur and Yashasvi Jaiswal return to Mumbai squad for quarter-finals.
While Thakur was out injured, MCA are reportedly unhappy about Jaiswal’s unexplained absence in last few matches despite no international commitments.#RanjiTrophy #DomesticCricket pic.twitter.com/d4qcfKB46G
— Cricbuzz (@cricbuzz) February 2, 2026
ముంబై స్క్వాడ్ : శార్ధూల్ ఠాకూర్(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, ముషీర్ ఖాన్, అఖిల్ హెర్వడ్కర్, సిద్దేశ్ లాడ్, సర్ఫరాజ్ ఖాన్, అకాశ్ ఆనంద్(వికెట్ కీపర్), హార్దిక్ తొమ్రే(వికెట్ కీపర్), సాయిరాజ్ పాటిల్, శామ్స్ ములానీ, తనుష్ కొతియాన్, తుషార్ దేశ్‌పాండే, మొహిత్ అవస్థ్, ఓంకార్ టర్మలే, దివ్యేశ్ సక్సేనా, సుయాన్ష్ షెడ్గే.
గత రెండు మ్యాచ్‌లకు దూరమైన యశస్వీ, గాయంతో ఆడలేకపోయిన శార్ధూల్ రాకతో ముంబై మరింత పటిష్టంగా మారనుంది. అంతర్జాతీయ మ్యాచ్‌లు లేనప్పుడు దేశవాళీలో ఆడాలనే బీసీసీఐ నిబంధనల మేరకు టీమిండియా ఆటగాళ్లు పలువురు రంజీ ట్రోఫీలో ఆడుతున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

