Bandi Ramesh : ‘కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి’
కాంగ్రెస్ పార్టీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దిగజారుడు రాజకీయాలను మానుకోవాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి రమేష్ అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ సత్యనారాయణపురం జంగాలకాలనీలో అమాయకమైన ప్రజలను మోసం చేయడం సరైనది కాదన్నారు.
– సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి రమేష్
ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 02 : కాంగ్రెస్ పార్టీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దిగజారుడు రాజకీయాలను మానుకోవాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి రమేష్ అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ సత్యనారాయణపురం జంగాలకాలనీలో అమాయకమైన ప్రజలను మోసం చేయడం సరైనది కాదన్నారు. పార్టీ మండల నాయకుడు తోట పెద్ద వెంకటరెడ్డి అధ్యక్షత జంగాల కాలనీలో జరిగిన కార్యక్రమంలో 25 కుటుంబాల నుండి 50 మంది సిపిఎంలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిపిఎం పార్టీలో అనేక సంవత్సరాలుగా ఉంటున్న పస్తం గోపాల్, యేసు, రేపల్లె వెంకన్న, పస్తం కొండలు, సింగపూర్ జానయ్య, వెంకన్న, రమేష్ తదితరులకు ఇల్లు ఇస్తామని చెప్పి ప్రచారంలో భాగంగా పిలిచి, వారి మెడలో కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలో చేరినట్టుగా ప్రకటించడం అత్యంత దుర్మార్గమైన విషయం అని మండిపడ్డారు. అమాయకమైన ప్రజలను సంక్షేమ పథకాలు ఇస్తామని పిలిచి మెడలో కండువాలు కప్పడం సరైన పద్ధతి కాదన్నారు. ఇలాంటి దిగజాలు రాజకీయాలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు షేక్ బషీరుద్దీన్, పార్టీ డివిజన్ నాయకులు నందిగామ కృష్ణ, తోట నరేష్ రెడ్డి, కార్తీక్, రాజశేఖర్, కుమ్మరి శ్రీనివాస్, ఆంటోనీ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Murder | పాతబస్తీలో కార్ల వ్యాపారి దారుణ హత్య..నిందితుడి కోసం గాలింపు
Dhadkan | బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘ధడ్కన్’కు సీక్వెల్.. కొత్త తారాగణంతో సీక్వెల్ ప్లాన్ చేస్తున్న మేకర్స్!
TTD | వైకుంఠ ద్వార దర్శనాల టికెట్లు, టోకెన్లు విడుదల తేదీని ప్రకటించిన టీటీడీ
Laxma Reddy | జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

