ప్రజలు మార్పు కోరుకుంటున్నారు : హరియాణ పరిణామాలపై కాంగ్రెస్ ఎంపీ దీపీందర్ హుడా
హరియాణ సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా అనంతరం కాంగ్రెస్ ఎంపీ దీపీందర్ హుడా కీలక వ్యాఖ్యలు చేశారు.
చండీఘఢ్ : హరియాణ సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా అనంతరం కాంగ్రెస్ ఎంపీ దీపీందర్ హుడా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మార్పు తీసుకురావాలని నిర్ణయించుకోవడంతోనే హరియాణాలో ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కాంగ్రెస్ నిశితంగా పరిశీలిస్తోందని హుడా చెప్పారు.
మరోవైపు హరియాణాలో రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ స్పందించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారనేందుకు ఇది సంకేతమని చెప్పారు. రైతులు, యువత, రెజ్లర్ల నుంచి పెరిగిన ఒత్తిడి ఫలితమే ఇదని, దేశంలోనూ ఇదే జరుగుతుందని జైరాం రమేష్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఇక మంగళవారం అంతకుముందు మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానా సీఎం పదవికి రాజీనామా చేశారు.
జన్నాయక్ జనతా పార్టీ (జేజేపీ)తో బీజేపీ పొత్తు తెగదెంపులు అయిన వెంటనే ఆయన సీఎం పదవి నుంచి వైదొలిగారు. కాగా, 90 మంది సభ్యులున్న హరియాణ అసెంబ్లీలో బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలున్నారు. 5గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో పాటు హెచ్ఎల్పీ ఎమ్మెల్యే గోపాల్ కంద కాషాయ పార్టీకి మద్దతిస్తున్నారు. ఇక హరియాణా నూతన సీఎంగా నాయబ్ సైనీని బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.
Read More :
Bajireddy Govardhan | చివరి వరకు కేసీఆర్తోనే నా ప్రయాణం.. స్పష్టం చేసిన బాజిరెడ్డి గోవర్ధన్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

