జనగామ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జిల్లాలోని దేవరుప్పుల మండలం పడమటి తండా (డి) సర్పంచ్ జాటోతు కౌస్య సురేందర్, జాటోత్ సోమన్న, వార్డు సభ్యులు జాటోత్ బికోజీ మరికొంత మంది నాయకులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
హన్మకొండలోని మంత్రి కార్యాలయంలో వారు కాంగ్రెస్ పార్టీని వీడి గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం ఇస్తామన్నారు. పార్టీ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటుందన్నారు.
కార్యక్రమంలో దేవరుప్పుల మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్, మాజీ మండల అధ్యక్షుడు బస్వ మల్లేష్, పల్లా సుందర్ రాంరెడ్డి, కొడకండ్ల ఏఎంసీ వైస్ చైర్మన్ కృష్ణమూర్తి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి చింత రవి తదితరులు పాల్గొన్నారు.