నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 20వ వార్డులో బీఆర్ఎస్ బలపరిచిన నస్రిన్ సుల్తానా ఇంతియాజ్ అలీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ ఎన్నికల ప్రచారంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి వార్డును అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్లిందని తెలిపారు. కానీ అబద్దపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ఏ మాత్రం అభివృద్ధి జరగలేదని అన్నారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు.