నర్సాపూర్ : నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామానికి చెందిన
కాంగ్రెస్ ( Congress ) సీనియర్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో ( BRS ) చేరారు. ఎమ్మెల్యే సునితాలక్మారెడ్డి సమక్షంలో దేవులపల్లి గ్రామానికి చెందిన సుమారు 50 మంది గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైనందున ఇతర పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు.
ప్రభుత్వం రైతు, ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందని విమర్శించారు. గ్రామాల అభివృద్ధి, రైతుల సంక్షేమం కేవలం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని అన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు పెద్ద మొత్తంలో ఉంటాయని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌడిపల్లి మండల అధ్యక్షుడు సారరామాగౌడ్, దేవులపల్లికి చెందిన నాయకులు పాల్గొన్నారు.