Jubilee hills by poll | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు తొక్కుతోంది. ఓటర్లను ప్రలోభపెడుతూ.. ప్రచారం కొనసాగిస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఫ్రీ బస్సు, ఉచిత బియ్యం పథకాలు రద్దు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ నేతలు.. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమంలో బిజీ అయిపోయారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్లకు యథేచ్చగా డబ్బులు పంచుతూ కెమెరా కంటికి చిక్కారు కాంగ్రెస్ నాయకులు. బోరబండ సైట్ 3 అంబేద్కర్ నగర్లో ఓటర్లకు స్థానిక మహిళా నాయకురాళ్లతో పాటు పలువురు నాయకులు డబ్బులు పంపిణీ చేశారు. ఓట్ల కోసం నోట్లు లెక్కబెట్టి వారికి చేతికి అందిస్తున్న దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బ్రేకింగ్ న్యూస్
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యధేచ్చగా ఓటుకు డబ్బులు పంచుతున్న కాంగ్రెస్ నాయకులు
బోరబండ సైట్ 3 – అంబేద్కర్ నగర్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ స్థానిక మహిళా నాయకురాలు యాదమ్మ రాజేశ్వరి, కాంగ్రెస్ నాయకులు pic.twitter.com/sfPIwMP66v
— Telugu Scribe (@TeluguScribe) November 8, 2025