RR4 | మత్తు వదలరా ప్రాంచైజీతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు రితేశ్ రానా. ఈ ప్రాంచైజీలో కమెడియన్ సత్య వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటించి ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేశాడని తెలిసిందే. సత్య సినిమాకే హైలెట్‌గా నిలిచిపోయాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ క్రేజీ యాక్టర్ లీడ్ రోల్లో రితేశ్ రానా డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు.
RR4గా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా మొదలైంది. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా ఈ చిత్రంతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇస్తోంది. యాక్షన్ కామెడీ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో పాపులర్ కమెడియన్ వెన్నెల కిశోర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సూపర్ కామిక్ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్వించే సత్యను లీడ్ రోల్లో తీసుకున్న డైరెక్టర్ రితేశ్ రానా.. మరి సిల్వర్ స్క్రీన్‌పై ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడు..? సత్య, రితేశ్ రానా ఈ సారి ఏం ప్లాన్ చేశారో చూడాలంటూ నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు మూవీ లవర్స్, నెటిజన్లు.
క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు సంయుక్తంగా RR4ను నిర్మిస్తున్నారు. వెన్నెల కిశోర్‌కు కూడా సూపర్ కామిక్ టైమింగ్ ఉంటుందని తెలిసిందే. ఓ వైపు సత్య, మరోవైపు వెన్నెల కిశోర్, ఇంకో మిస్ యూనివర్స్ ఇండియా.. ఈ క్రేజీ కాంబో చూస్తుంటే రితేశ్ రానా ఏదో పెద్ద ప్లాన్ వేశాడని అర్థమవుతోంది.
K Ramp Movie | ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం ‘కే ర్యాంప్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
Rajinikanth | 50 ఏళ్ల సినీ కెరీర్.. రజనీకాంత్‌ను సన్మానించనున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్
Ajay Bhupathi | ‘మంగళవారం’ దర్శకుడి కొత్త ప్రాజెక్ట్.. అనౌన్స్మెంట్ రేపే.!