కరీంనగర్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి కరీంనగర్‌కు వస్తున్న సందర్భంగా బుధవారం కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్ట్‌చేశారు. రేకుర్తికి చెందిన మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాశ్ పీసీసీ ఆధ్వర్యంలో ఇటీవల కొత్తగా ఏర్పాటుచేసిన ప్రియాంకాగాంధీ సంఘటన్లో రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా పనిచేస్తున్నారు.
ఆయన నివాసం ఉంటున్న రేకుర్తిలో 22ఏ బాధితులు జేఏసీ పేరుతో పలు ఆందోళనలు చేపట్టారు. సీఎం కరీంనగర్ వస్తున్న సందర్భంగా ఆయనను కలిసి తమ గోడు చెప్పుకొంటామని ఇటీవల ప్రకటించడంతో కొత్తపల్లి పోలీసులు 22ఏ బాధితుల జేఏసీ నాయకులతోపాటు నందెల్లి ప్రకాశ్‌ను అరెస్ట్ చేసి, కరీంనగర్ పీటీసీలో నిర్బంధించారు.