హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : సిరిసిల్ల సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడింది సొల్లు పురాణం తప్ప ఏమీ లేదని మాజీ మం త్రి ఎస్ నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. వినాయక నిమజ్జనాల సందర్భంగా సచివాలయం ముందు కేసీఆర్ పాటల ఫిరంగులు సీఎం రేవంత్‌రెడ్డి గుండెల్లో మోగాయని, ఆ భయం సిరిసిల్ల సభలో స్పష్టంగా కనిపించిందని దెప్పిపొడిచారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వకుండా సిరిసిల్ల చేనేత కార్మికుల పొట్టకొటిన రేవంత్‌రెడ్డి, హంతకుడే సంతాప సభ పెట్టిన చందంగా ఉద్ధరించానని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. .
రేవంత్ అహంకారం తగ్గించుకుంటే మంచిది: పల్లె రవి కుమార్

Palle Ravi Kumar Goud
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి అహంకారం తగ్గించుకుని విధానపరమైన విషయాలు మాట్లాడితే మంచిదని రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్ హితవు పలికారు. సిరిసిల్ల పర్యటనలో రేవంత్‌రెడ్డి, ఆయన బృందం తీరు చూస్తే జిల్లా అభివృద్ధికి వచ్చినట్లు కాకుండా దండయాత్రకు వచ్చినట్లు ఉన్నదని విమర్శించారు. సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు, నేడు చేనేత కార్మికుల ఆత్మహత్యల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.
అక్కసుతోనే రేవంత్ అనుచిత వ్యాఖ్యలు: గోసుల

Gosula Srinivas
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : సిరిసిల్ల గడ్డపై సీఎం రేవంత్‌రెడ్డి అక్కసుతోనే కేసీఆర్, కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోసుల శ్రీనివాస్‌యాదవ్ మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో సిరిసిల్లలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని పేర్కొన్నారు. రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడటాన్ని తెలంగాణ ప్రజలు సహించబోరని హెచ్చరించారు.