హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): సింగరేణికి చెందిన జైపూర్ ప్లాంట్‌లో ఉత్పత్తయ్యే విద్యుత్తును తెలంగాణ అవసరాలకే వినియోగించాలని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సింగరేణి (జైపూర్) కరెంటును రాజస్థాన్‌కు తాకట్టుపెట్టే జాయింట్ వెంచ ర్ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని అన్నారు. ఈ మేరకు బుధవారం సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్తు వ్యవస్థ నిర్వహణలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
‘ఒకవైపు కరెంటు లేక రైతుల కండ్లెదుటే పంటలు ఎండిపోతుం టే, మరోవైపు మన రాష్ట్రంలో తకువ ఖర్చుతో ఉత్పత్తయ్యే విద్యుత్తును ఇతర రాష్ట్రాలకు ధారాదత్తం చేసేందుకు మీరు సిద్ధపడటం ప్రజావ్యతిరేక చర్య కాక మరేమిటి?’ అంటూ నిలదీశారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌కు కావాల్సిన బొగ్గు మన సింగరేణి గనుల్లోనే ఉన్నదని, నడపడానికి కావాల్సిన నీళ్లు పకనే ఉన్న గోదావరి నుంచే పుషలంగా అందుతాయని గుర్తుచేశారు. ‘బొగ్గు మనది, నీళ్లు మనవి, స్థలం మనది. అలాంటప్పుడు ఇకడ కొత్తగా చేపడుతున్న విస్తరణలో 800 మె గావాట్ల విద్యుత్తును రాజస్థాన్‌కు కట్టబెట్టేలా జాయింట్ వెంచర్ ఒప్పందం చేసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటి?’ అని ప్రశ్నించారు.
ఇటీవల సింగరేణి రాజస్థాన్‌కు చెందిన ఆర్ఆర్వీయూఎన్ఎల్ విద్యుత్తు సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కొత్తగా నిర్మించే థర్మల్ విద్యుత్తులో 800 మెగావాట్లు రాజస్థాన్‌కు కేటాయి స్తున్నట్టు పేర్కొన్నారని తెలిపారు. రాజస్థాన్‌లో 1500 మెగావాట్ల భారీ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధపడుతున్నారని, ఇది దాదాపు రూ.22 వేల కోట్ల భారీ ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. మన రాష్ట్రమే కరెంటు లేక అల్లాడుతున్న వేళ ఈ తొందరపాటు నిర్ణయం ఎందుకు? అని సూటిగా ప్రశ్నించారు.
నిబంధనల ప్రకారం థర్మల్ కేంద్రాల్లో 45 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి.. కానీ కనీస నిల్వలు ఉంచకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. రాష్ట్రంలో 40 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని చెప్తున్న ముఖ్యమంత్రి.. విద్యుత్తు కేంద్రా ల వద్ద ఎందుకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. ఈ వాస్తవాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిలదీసేందుకు బీఆర్ఎస్ పార్టీ వెళ్తే, పోలీసులను పెట్టి అడ్డుకోవడం ఏమిటని నిలదీశారు.