హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల సభ సాక్షిగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కారుకూతలు కూసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నోటిని ఫినాయిల్‌తో కడిగినా తప్పులేదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీలో నెత్తీనోరూ బాదుకున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతోనే ఇప్పుడు రోడ్ల వెంటపడి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్‌కు 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నదని ఆరోపించిన రేవంత్, చివరకు అదే నోటితో 67 ఎకరాలని ఒప్పుకొన్నారని ఎద్దేవా చేశారు. పది రోజులపాటు విస్తృత ప్రచారం చేసుకున్నా రేవంత్ ముఖం చూసేందుకు సిరిసిల్ల ప్రజలు ఎవరూ ఇష్టపడలేదని, కాంగ్రెస్ కార్యకర్తలు మినహా ఆయన వెంట జనం లేరన్న వాస్తవం స్పష్టమైందని చెప్పారు.
గోడలకు రంగులేసుకునే నీకు ఆస్తులు ఎకడివి?
కేటీఆర్ అమెరికాలోని ప్రముఖ కంపెనీలో ఆరేండ్లపాటు ఉద్యోగం చేసి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారని గుర్తుచేసిన ప్రశాంత్ రెడ్డి.. గతంలో గోడలకు రంగులేసుకున్న రేవంత్‌రెడ్డికి నేడు వందల కోట్ల రూపాయలు, జూబ్లీహిల్స్ లో ప్యాలెస్, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ వేల కోట్ల భూములు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.
అబద్ధాలతో కాలక్షేపం: పువ్వాడ

Khammam Puvvada Ajay Kumar
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు, విద్వేషాలు, అసభ్య దూషణలతో కాలక్షేపం చేస్తూ రాష్ట్రం లో పరిపాలనను పూర్తిగా గాలికి వదిలేశారని మాజీ మం త్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. సిరిసిల్ల బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. కాంగ్రెస్ పాలనపై రోజురోజుకూ ప్రజల్లో పెరుగుతున్న తీవ్ర వ్యతిరేకతను చూసి తట్టుకోలేక, తీవ్ర ఆవేశం, ఆక్రోశంతోనే రేవంత్‌రెడ్డి దిగజారుడు పదజాలంతో అసత్య ఆరోపణలకు దిగారని మండిపడ్డారు.