ప్రజలకు ముఖం చాటేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, వెయ్యి రోజులు గడుస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ విమర్శించారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో...
దేవరకొండ, అక్టోబర్ 28 : కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, వెయ్యి రోజులు గడుస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ విమర్శించారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నేరడుగొమ్ము మండలం కచారాజుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బీచ్యు నాయక్ తండాకు చెందిన పలువురు రవీంద్ర కుమార్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ముఖం చాటేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ఆసరా పెన్షన్లను రూ.2,000 నుండి రూ.4,000కు పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రైతులకు ఎకరానికి రూ.10,000కు బదులుగా రూ.15,000 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, రైతులకు ఇచ్చిన హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోతోందని విమర్శించారు.

ప్రజలకు ముఖం చాటేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
ప్రజలు తమ సమస్యలను ప్రస్తావించినప్పుడు, ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సింది పోయి విమర్శలకు తిట్లతో బదులిస్తున్నారని రవీంద్ర కుమార్ విమర్శించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ రాష్ట్రం రాహుల్ గాంధీకి ఏటీఎంగా మారిందన్నారు. రాష్ట్ర వనరులను రాజకీయ అవసరాల కోసం వినియోగిస్తున్నారంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ నిరంతరం ప్రజల తరఫున పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. రాబోయే ఏడాదిన్నర కాలంలోనే బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, ఆయన నాయకత్వంలో తెలంగాణను తిరిగి దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు బీఆర్ఎస్ కృషి చేస్తుందని రమావత్ రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వడత్య బాలు, గోవింద్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రజలకు ముఖం చాటేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
Dasyam Vinay Bhaska | పార్టీలు మారడమే కడియం కమిట్మెంట్ : దాస్యం వినయ్ భాస్కర్
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రస్థానం ముగిసింది : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
Hepatitis B | హెపటైటిస్ బి వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఆమోదం తెలిపిన అమెరికా ఎఫ్‌డీఏ..
రోడ్డు మరమ్మతులు చేపట్టాలని టిప్పర్ డ్రైవర్ల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

