దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రస్థానం ముగిసింది : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కరువు రాష్ట్రంగా మార్చింది కాంగ్రెస్సేనని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతున్న పరాజయాలు ఆ పార్టీ పతనానికి సంకేతమని, తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రస్థానం ముగిసే రోజులు దగ్గరపడ్డాయని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు.
వేలేరు: సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కరువు రాష్ట్రంగా మార్చింది కాంగ్రెస్సేనని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతున్న పరాజయాలు ఆ పార్టీ పతనానికి సంకేతమని, తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రస్థానం ముగిసే రోజులు దగ్గరపడ్డాయని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. మూడేళ్ల క్రితం తెలంగాణ ఎట్లా ఉండేది, ప్రస్తుతం ఎట్లా ఉందో పట్టభద్రులు గమనించి ఓటు వేయాలని సూచించారు. హనుమకొండ జిల్లా వేలేరు మండలం సోడాశపల్లిలో బుధవారం వేలేరు, ధర్మసాగర్, చిల్పూరు మండలాలకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. గత పదేళ్లలో తెలంగాణలో సాగునీటి రంగం ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం పంటలకు సాగునీరు ఎందుకు అందడం లేదని ప్రశ్నించారు.
ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లో పట్టభద్రులను గుర్తించి, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వేలేరు, ధర్మసాగర్, చిల్పూరు మండలాల ప్రజల ఓట్లతోనే కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా గెలుపొందారని పేర్కొన్న పల్లా.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదవులు అనుభవించి, అనంతరం పార్టీకి నమ్మకద్రోహం చేశారని ఆరోపించారు. స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ నియోజకవర్గాలు తనకు రెండు కళ్లలాంటివని, ఈ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రస్థానం ముగిసింది : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
Hepatitis B | హెపటైటిస్ బి వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఆమోదం తెలిపిన అమెరికా ఎఫ్‌డీఏ..
రోడ్డు మరమ్మతులు చేపట్టాలని టిప్పర్ డ్రైవర్ల నిరసన
MLA Sudheer Reddy | ఎవరి గూడు చెదరనివ్వబోం.. మూసీ పునరుద్ధరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
తక్కెళ్లపాడు సర్పంచ్‌కు మంత్రి సీతక్క ప్రశంస
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

