Dasyam Vinay Bhaska | పార్టీలు మారడమే కడియం కమిట్మెంట్ : దాస్యం వినయ్ భాస్కర్
కడియం శ్రీహరిపై హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
వేలేరు : కడియం శ్రీహరిపై హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్టీలు మారడమే ఎమ్మెల్యే కడియం శ్రీహరి కమిట్మెంట్ అని ఎద్దేవా చేశారు. వేలేరు మండలం సోడాశపల్లిలో బుధవారం వేలేరు, ధర్మసాగర్, చిల్పూరు మండలా లకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసిన కడియం రాజకీయ భవిష్యత్తు స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఉపఎన్నిక వస్తే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. గతంలో టీడీపీలో ఉన్న సమయంలో కడియం శ్రీహరి వ్యవహరించిన తీరు కూడా అందరికీ తెలుసని విమర్శించారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
గ్రామాల వారీగా పట్టభద్రులను గుర్తించి ఓటరు నమోదును వేగవంతం చేయాలని నాయకులు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ నాగుర్ల వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య, నాయకులు ఎడవెళ్లి కృష్ణారెడ్డి, మాజీ కార్పొరేటర్ రాధిక రెడ్డి, మాజీ జడ్పిటిసి కీర్తి వెంకటేశ్వర్లు, కర్ర సోమిరెడ్డి, మనోజ్ రెడ్డి, రమేశ్ నాయక్, మాధవరెడ్డి, ధర్మారెడ్డి, దేవేందర్, మహేందర్, సురేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasyam Vinay Bhaska | పార్టీలు మారడమే కడియం కమిట్మెంట్ : దాస్యం వినయ్ భాస్కర్
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రస్థానం ముగిసింది : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
Hepatitis B | హెపటైటిస్ బి వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఆమోదం తెలిపిన అమెరికా ఎఫ్‌డీఏ..
రోడ్డు మరమ్మతులు చేపట్టాలని టిప్పర్ డ్రైవర్ల నిరసన
MLA Sudheer Reddy | ఎవరి గూడు చెదరనివ్వబోం.. మూసీ పునరుద్ధరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

