హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది ఉచిత చేపపిల్లల పంపిణీ దిశగా ప్రభుత్వంలో కసరత్తు కనిపించడం లేదు. టెండర్లు నిర్వహించే విషయంలో ప్రభుత్వం తరపున ఇప్పటికీ ఎలాంటి కదలిక లేకపోవడంతో చేప పిల్లల పంపిణీ ఉంటుందో లేదో తెలియని సందిగ్ధత నెలకొన్నది.
ఇప్పటికే జిల్లాల నుంచి మత్స్యశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. ఇవి వచ్చి నెలలు గడుస్తున్నా టెండర్ల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. ఎల్‌నినోను సాకుగా చూపి ప్రక్రియను మరింత ఆలస్యం చేసే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతున్నది.