Jagadish Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలోని ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను మోసం చేసేలా ఉందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. లేనివి ఉన్నట్లుగా చూపించిన మాయల మాంత్రికుడు రేవంత్‌రెడ్డి అంటూ మండిపడ్డారు. అంచనాలకు సంబంధం లేకుండా అరచేతిలో వైకుంఠం చూపించించారని.. కాంగ్రెస్ మేనిఫెస్టోపై పెట్టుకు ఆశలు మళ్లీ అడియశలయ్యాయన్నారు. ప్రభుత్వం ఆదాయం తగ్గిందని.. కాంగ్రెస్ నాయకుల ఆదాయం పెరిగిందని ఆరోపించారు. లేని గొప్పలకు పోయి.. నవ్వులపాలైనట్లుందన్నారు. రాష్ట్ర బడ్జెట్ అన్ని రంగాల ప్రజలకు తీవ్ర నిరాశ మిగిల్చిందని.. రేవంత్ పాలనలో లక్షా 50 వేల పింఛన్లు కోత పెట్టింది వాస్తవం కాదా? అంటూ ప్రశ్నించారు.
రూ.31 వేల కోట్లతో రుణమాఫీ చేస్తామని చెప్పి.. రూ.20వేల కోట్లతో రుణమాఫీ చేశామని ఈ బడ్జెట్లో చెప్పారని.. గత ఏడాది రూ.5,888 కోట్ల రెవెన్యూ మిగులు ఉందని.. ఈ ఏడాది రెవెన్యూ మిగులు రూ.2,738 కోట్లు ఉంటుందని అంటున్నారని.. ప్రతి ఏటా రెవెన్యూ మిగులు ఉంటే రాష్ట్రం దివాలా తీసిందని ఎట్లా చెబుతారని నిలదీశారు. గడిచిన ఏడాది మైనారిటీలకు వెయ్యి కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని.. మైనారిటీ మంత్రి లేడని.. కనీసం మైనార్టీలకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం రాష్టంలో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లను మూసేసే కుట్ర జరుగుతుందని.. రాష్ట్రంలో బీసీలకు మొండిచేయి బడ్జెట్లో బీసీలకు సబ్ ప్లాన్ పెట్టలేదన్నారు. వాస్తవాలను దూరంగా.. నమ్మశక్యంగా లేని బడ్జెట్ అని.. దళితులు, గిరిజనులు, బహుజనులు ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసాగించేలా ఉంది ఈ బడ్జెట్.. ఈ బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి ఏ మాత్రం తోడ్పడదన్నారు.