అల్లాపూర్ : జూబ్లీహిల్స్ ( Jubilee Hills ) నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ( Congress ) పార్టీకి ఓటమి ఖాయమని బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు ఖాజా ముజువుద్దీన్ ( Khaja Mujuuddin ) అన్నారు. బోరబండలో పలు మసీదుల వద్ద బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునితా గోపినాథ్‌కు మద్దుతుగా బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు ఖాజా బద్రుద్దీన్ తో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ముస్లిం మైనార్టీలకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు. మసీద్‌లోని ఇమామ్‌లు, మోజామ్లకు వేతనాలు ఇచ్చి వారి అభ్యున్నతికి కృషిచేశారని గుర్తుచేశారు. ఇక రెండేళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో ముస్లింలకు తీవ్రఅన్యాయం జరిగిందని, రానున్న ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటు వేసి మాగంటి సునితాగోపినాథ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.