కరోనా బారినపడి కాంగ్రెస్ అభ్యర్థి మృతి
కాంగ్రెస్ అభ్యర్థి మృతి |

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కరోనా మహమ్మారి బారినపడి గురువారం కన్ను మూశారు. ముర్షిదాబాద్ జిల్లాలోని షంషేర్‌గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి మొహ్మద్ రెజాల్ హక్ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కరోనా బారినపడ్డారు. దీంతో ఆయనను కోల్‌కతాలోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా.. పరిస్థితి విషమించి మరణించారు. ఇదిలా ఉండగా.. 294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో ఎనిమిది విడుతల ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే నాలుగు విడుత పోలింగ్ పూర్తి కాగా.. ఈ నెల 17న 45 అసెంబ్లీ స్థానాలకు ఐదో విడుత ఎన్నికలు జరుగనుండగా.. బుధవారంతో ప్రచారం ముగిసింది. నాలుగో దశలో కూచ్ బెహార్లో చెలరేగిన హింస నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ సెలైంట్ పీరియడ్‌ను 48 గంటల నుంచి 72 గంటలకు పెంచిన విషయం తెలిసిందే. ఐదో విడుత బరిలో 342 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకోనుండగా.. 1.13 కోట్ల మంది ఓటర్లు వారి భవితవ్యం తేల్చనున్నారు. ఉత్తర 24 పరగణాలు, పూర్బా బర్ధమాన్, నాడియా, జల్పాయిగురి, డార్జిలింగ్, కాలింపాంగ్ జిల్లాల్లో పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.
ఇవికూడా చదవండి..
పొగరాయుళ్లతోనే అగ్ని ప్రమాదాలు!
రోజుకు 3 లక్షల కేసులు!
కరోనా ఘోరకలి
టీకా వేస్కో.. గిఫ్ట్ తీస్కో!
15-04-2021 గురువారం.. మీ రాశి ఫలాలు
రాజేంద్రనగర్ ఓఆర్ఆర్పై ప్రమాదం.. మంటల్లో చిక్కుకొని డ్రైవర్ సజీవ దహనం
కుంభమేళా కుదింపు కుదరదు : అధికారులు
విశాఖలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
దేశంలో కరోనా కల్లోలం.. రెండు లక్షలు దాటిన కేసులు
రాష్ట్రంలో కొత్తగా 3037 కరోనా కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

