యాసంగి సాగుపై చెరోమాట!
యాసంగిలో పంటల సాగుపై ప్రభుత్వంలోనే భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. యాసంగి సీజన్‌ను వాయిదా వేసుకోవాలని, పంటలను సాగు చేయొద్దని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు ఇటీవలే పిలుపునిచ్చారు. సీఎం ప్రకటనకు విరుద్ధంగా తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యాసంగిలో పంటలు సాగు చేసుకోవచ్చని చెప్పడం గమనార్హం. ప్రభుత్వం క్రాప్‌హాలిడే ప్రకటించలేదని, రైతులు పంటలు సాగు చేయాలని మంత్రి సూచించారు.
- పంటలు సాగొద్దన్న సీఎం రేవంత్ వేసుకోవచ్చన్న మంత్రి తుమ్మల
- ఆ ఇద్దరి ప్రకటనలతో గందరగోళం.. అన్నదాతల నుంచి విమర్శల వెల్లువ
హైదరాబాద్, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ): యాసంగిలో పంటల సాగుపై ప్రభుత్వంలోనే భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. యాసంగి సీజన్‌ను వాయిదా వేసుకోవాలని, పంటలను సాగు చేయొద్దని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు ఇటీవలే పిలుపునిచ్చారు. సీఎం ప్రకటనకు విరుద్ధంగా తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యాసంగిలో పంటలు సాగు చేసుకోవచ్చని చెప్పడం గమనార్హం. ప్రభుత్వం క్రాప్‌హాలిడే ప్రకటించలేదని, రైతులు పంటలు సాగు చేయాలని మంత్రి సూచించారు. ఒకవైపు పంటలు వెయ్యొద్దని సీఎం చెప్తుండగా, లేదు లేదు పంటలు వేసుకోవచ్చని మంత్రి సెలవిస్తున్నారు. ఇలా పంటల సాగుపై విరుద్ధం ప్రకటనలతో రైతుల్లో గందరగోళం నెలకొన్నది. అసలు ఈ ప్రభుత్వానికి ఒక ఆలోచనంటూ లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎవరికి వారే యమునా తీరే మాదిరిగానే ఎవరికి తోచినట్టు, ఎవరికి నచ్చినట్టు వాళ్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి ఒక లక్ష్యం లేదని, ఒక్క మాటపై స్పష్టత లేదనే విమర్శలున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

