ఏపీ ఎమ్మెల్యేకు తెలంగాణ పురస్కారం!
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ విశిష్ట పురస్కారాల ఎంపిక వివాదాస్పదంగా మారింది. ఈసారి ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యేను విశిష్ట సేవా పురస్కారానికి ఎంపిక చేసినట్టు సమాచారం.
- వివాదాస్పదంగా మారిన తెలుగు యూనివర్సిటీ నిర్ణయం
- తెలంగాణ కళాకారులను విస్మరించిన అధికారులు
- ఎంపిక రద్దుచేయాలని పలువురి కళాకారుల డిమాండ్
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ విశిష్ట పురస్కారాల ఎంపిక వివాదాస్పదంగా మారింది. ఈసారి ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యేను విశిష్ట సేవా పురస్కారానికి ఎంపిక చేసినట్టు సమాచారం. గతంలోనూ ఏపీ మూలాలున్న పారిశ్రామికవేత్తకు విశిష్ట సేవా పురస్కారం ప్రకటించారు. ఈసారి ఏకంగా ఏపీ ఎమ్మెల్యే వైపు మొగ్గుచూపడం గమనార్హం. ఈ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ కళాకారులను విస్మరించి.. ఏపీ వారికి ఎలా ఇస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తెలుగు యూనివర్సిటీ ఏటా ప్రముఖులకు విశిష్ట సేవా పురస్కారాలను అందజేస్తున్నది. సాహిత్యం, సంస్కృతి, సామాజిక సేవారంగాల్లో విశేష కృషిచేసిన వారికి పురస్కారంతోపాటు రూ.లక్ష చొప్పున నగదును అందజేస్తారు. ఈసారి లలిత కళా రంగంలో పురస్కారం అందజేయాలని వర్సిటీ నిర్ణయించింది.
ఎంపిక కమిటీ సమావేశం
ఇటీవలే విశిష్ట సేవా పురస్కారం ఎంపిక కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనైట్టె తెలిసింది. వాదోపవాదాలు జరుగడంతోపాటు ఏపీ టీడీపీ ఎమ్మెల్యే ఎంపికను కొందరు వ్యతిరేకించినట్టు సమాచారం. ఏపీలోని రాజమండ్రిలోనూ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఉన్నది. కానీ తెలంగాణ యూనివర్సిటీ నుంచే ఏపీ ప్రముఖుడికి పురస్కారం ఇవ్వడంపై తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. గతంలో కూడా ఏపీకి చెందిన ఓ మాజీ ఎంపీని ఇదే వర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచి సన్మానించారు.
ఇలా ఏపీ వారికి పెద్దపీట వేసి తెలంగాణ కళాకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయరాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభు త్వం, విద్యాశాఖ జోక్యం చేసుకొని ఈ ఎంపికను రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై తెలుగు యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ నిత్యానందరావును ‘నమస్తే తెలంగాణ’ ఆరా తీయగా ఆయన సమాధానం దాటవేశారు. డిసెంబర్లో ఈ పురస్కారాన్ని ఇస్తామని, ఇప్పుడే ఏం తొందరలేదని చెప్పారు. అయినా తాము అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ విషయంలో బిజీగా ఉన్నామంటూ పొడిపొడిగా సమాధానమివ్వడం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

