ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం చివరి ఎగ్జామ్ పూర్తి చేసుకొని పరీక్షా కేంద్రం నుంచి బయటికొచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా కనిపించారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలుకరించుకొని కాసేపు సరదాగా గడిపారు.
నెక్ట్స్ ఎంటీ అంటూ ఉన్నత చదువులపై పరస్పరం ఆరా తీసుకున్నారు. అనంతరం ఆత్మీయ వీడ్కోలు చెప్పుకుంటూ ఇండ్లకు బయలుదేరారు