హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల కలెక్టర్గా అనురాగ్ జయంతి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ శ్రీనివాసరావు, ఆయాశాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే జోగులాంబ గద్వాల కలెక్టర్గా వల్లూరి క్రాంతి బాధ్యతలు సైతం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమెకు సిబ్బంది శుభాకాంక్షలు చెప్పారు. వరంగల్ కలెక్టర్ గోపీ సైతం బాధ్యతలు చేపట్టారు. అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వికారాబాద్ కలెక్టర్ కే నిఖిల సైతం బాధ్యతలు స్వీకరించారు.