మామిళ్లగూడెం, జూలై 8: జిల్లాలో ఓటర్లు పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను స్వీకరించే ప్రక్రియ సక్రమంగా జరగాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్లతో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు వివరాలతో పూర్తి చేసిన ఫారాలు బీఎల్వో తీసుకున్న తర్వాత వాటిని డిజిటలైజేషన్ చేస్తారని, వారి పేర్లు మాత్రమే ఓటరు డ్రాఫ్ట్ రోల్లో వస్తాయన్నారు. ఈ ప్రక్రియలో ప్రజాప్రతినిధులు, పార్టీల ప్రతినిధులు భాగస్వామ్యం కావాలన్నారు. ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి, వాటిని పూరించిన తర్వాత తిరిగి స్వీకరించి ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ చేపడుతున్నామని తెలిపారు.
జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 99.07 శాతం పూర్తయిందని, కేవలం 3,744 మంది ఓటర్లకు సంబంధించి అందుబాటులో లేకపోవడం, వివరాలు లభించకపోవడంతో పంపిణీ కాలేదని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు ఓటర్లు పూర్తి చేసిన 31.57 శాతం ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి తీసుకున్న తర్వాత వాటి డిజిటలైజేషన్ ప్రక్రియ చేపడుతున్నట్లు కలెక్టర్ వివరించారు. పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు క్రియాశీలకంగా ఉండి వివరాల సేకరణలో సహకరించాలన్నారు. ఎస్డీసీ సదానందం, కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకులు ఎంఏ రాజు, డీటీ అన్సారీ, వివిధ పార్టీల నాయకులు అన్నెం గోపాలరావు, భూక్యా శ్యాంసుందర్నాయక్, వి.రాజేశ్, బెల్లం వేణుగోపాల్, వెంకటరావు, మంకెన రమేశ్, ఆళ్ల రాంబాబు, ఉమాశంకర్, లింగనబోయిన సతీశ్, పసుమర్తి శ్రీనివాస్, కృష్ణప్రసాద్, తిరుపతి, వీరబాబు, చెరుకుపల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు.