హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం సేకరించిన భూములకే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) అమలు చే యాలని, టీడీఆర్ ప్రక్రియ మొత్తాన్ని పూర్తిగా ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. టీడీఆర్‌లో ఎలాంటి అవకతవకలకు ఆసారం లేకుండా పారదర్శకమైన వ్యవస్థను రూపొందించాలని స్పష్టంచేశారు. భూసేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతోపాటు, ల్యాండ్ పూలింగ్‌లో మధ్యవర్తుల జోక్యాన్ని సహించవద్దని సూచించారు.
ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో హెచ్ఎండీఏ, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం ఆదేశించా రు. రాష్ట్రంలోని రోడ్డు నెట్వర్ మొత్తాన్ని ఒకే వ్యవస్థ కిందికి తీసుకురావాలని చెప్పారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి) జయేశ్ రంజన్, సీఎం కార్యదర్శి మణిక్రాజ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొన్నారు.