వికారాబాద్, ఆగస్టు 6 : తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో నిర్వహించిన జయంతి వేడుకలో కేటీఆర్‌తో కలిసి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అలాగే, హైదరాబాద్‌లోని నందినగర్‌లో మాజీ సీఎం కేసీఆర్ నివాసంలో గురువారం నిర్వహించిన సమావేశానికి డాక్టర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెతుకు ఆనంద్‌ను ప్రకాశ్ అంబేద్కర్‌కు పరిచయం చేశారు.