హైదరాబాద్, ఆగస్టు 6: స్టాండర్డ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభం 26.5 శాతం ఎగబాకి రూ.36 కోట్లుగా నమోదైంది. అలాగే సమీక్షాకాలంలో కంపెనీ ఆదాయం రూ.252.2 కోట్లుగా నమోదైంది.
కిందటేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన ఆదాయంతో పోలిస్తే 41.5 శాతం వృద్ధి కనబరిచింది. వ్యాపార విస్తరణలో భాగంగా సంస్థ అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న ఏఐ డాటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్లోకి అడుగుపెట్టినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం జీస్కేల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌లో 51 శాతం వాటాను రకొనుగోలు చేసింది.