గూడూరు, డిసెంబర్ 30 : పారా త్రోబాల్ క్రీడాకారిణి దయ్యాల భాగ్యను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. భాగ్యను సోమవారం సీఎం దగ్గరకు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్, ప్రభుత్వ విప్ అయిలయ్య తీసుకెళ్లి సమస్యను వివరించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గొల్లగూడేనికి చెందిన భాగ్య..ఇటీవల అంతర్జాతీయ స్థాయి పారా త్రోబాల్ పోటీల్లో పసిడి పతకంతో మెరిసింది. నిరుపేద కుటుంబానికి చెంది దివ్యాంగురాలైన భాగ్యను భవిష్యత్లో ఆదుకుంటామని, ఒలింపిక్స్లో రాణించే ప్లేయర్లకు ఇచ్చే ప్రోత్సాహకాలను ఆమెకు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.