హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ సాధన ఉద్యమంలో సుదర్శన్‌రెడ్డి పోషించిన చురుకైన పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుందని, ఆయన సేవలు చిరస్మరణీయమని సీఎం కొనియాడారు. సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన ముఖ్యమంత్రి ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కొండా సురేఖ, సీతక్క, గడ్డంవివేక్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పలువురు సీనియర్ నాయకులు పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఉద్యమంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు.