అబ్బాయిలకు ఇవి చెప్పండి
చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లల పెంపకంలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. అదే అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి చూసీచూడనట్లుగా ఉంటారు. మంచి చెప్పడంలో, చెడును విడమర్చడంలో కాస్త నిర్లిప్త ధోరణి ప్రదర్శిస్తుంటారు.
చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లల పెంపకంలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. అదే అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి చూసీచూడనట్లుగా ఉంటారు. మంచి చెప్పడంలో, చెడును విడమర్చడంలో కాస్త నిర్లిప్త ధోరణి ప్రదర్శిస్తుంటారు. కానీ, అడ్డాల నాడు బుద్ధులు చెప్పకపోతే గడ్డాల నాడు మీ బిడ్డడు అడ్డంగా తిరిగే ప్రమాదం ఉంది. కాబట్టి, పిల్లాడు మంచి పౌరుడిగా ఎదగాలంటే చిన్న వయసులోనే కొన్ని విషయాలు నేర్పించడం అవసరం.
ఆడ పిల్లలను గౌరవించాలి: ఇంట్లో తల్లిని మాత్రమే కాదు చెల్లి, అక, స్నేహితురాలితోపాటు ఇతర మహిళలను గౌరవించాలని చిన్నప్పటి నుంచే నేర్పించాలి. నిజమైన గొప్పతనం ఎదుటివారిని గౌరవించడంలోనే ఉంటుందని పిల్లాడికి చెప్పాలి.
అబ్బాయిలు కూడా ఏడవచ్చు: అబ్బాయిలు ఎవరైనా ఏడుస్తుంటే ఆడపిల్లలా ఏడుస్తావేంటి? అని ఎగతాళి చేస్తుంటారు. కానీ, అందులో ఎలాంటి నిజం లేదు అని తల్లిదండ్రులు కొడుకి చెప్పాలి. కోపం, ప్రేమ, బాధ, సంతోషం ఎలా వ్యక్తపరుస్తామో.. ఏడుపు కూడా అలాంటి భావ ప్రకటనే. బాధను దాచుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు అనే విషయాలు పిల్లలకు నేర్పించాలి.
తప్పు చేస్తే ఒప్పుకో: ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో తప్పులు చేయడం సహజం. కానీ, చేసిన తప్పును ఒప్పుకోవడం ముఖ్యం. పిల్లలు తప్పు చేసినా ఒప్పుకోవడం నేర్పించాలి. చేసిన తప్పునకు క్షమాపణ చెప్పడం మంచి లక్షణం. ఈ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలి.
ఇంటి పనులు అందరి బాధ్యత: చాలామంది ఇంటి పనులు కేవలం ఆడవాళ్ల బాధ్యత అనే భావనతో ఉంటారు. తమ పిల్లలకు సైతం అలాంటి మాటలే చెబుతుంటారు. ఆ ఆలోచన మారాలి. ఇంటి పని కుటుంబసభ్యుల అందరి బాధ్యత అని చిన్నప్పటి నుంచే చెప్పాలి. అది ఆడవాళ్ల పని అనే భావన పిల్లల మనసులోకి రాకుండా వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం, పాత్రలు శుభ్రం చేయడం లాంటి పనులను మగ పిల్లలకూ నేర్పాలి.
అదొక్కటే ముఖ్యం కాదు: జీవితంలో విజయం సాధించడం అంటే డబ్బు సంపాదించడం, జీతం ఎకువగా ఉండటం కాదు. నిజాయతీతో ఉండటం, ఇతరులతో దయగా ఉండటం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం అనే విలువైన మాటలు తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించడం ఎంతో ముఖ్యం.
నేర్చుకోవడం ఆపకూడదు: జీవితంలో ప్రతి రోజూ కొత్త పాఠమే. పుస్తకాల నుంచి మాత్రమే కాదు, మనుషుల నుంచి, అనుభవాల నుంచి, తప్పుల నుంచి కూడా నేర్చుకోవాలి. ఇది జీవితంలో గెలవడానికి సహాయపడుతుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- child
- girls
- good citizen
- life style
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

