MLA Kalvakuntla Sanjay | కోరుట్ల, ఏప్రిల్ 23: కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ నాయకులకు బుద్ధిరావాలని, కాళేశ్వరం కమీషన్ పై హైకోర్టు వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నామని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. గురువారం కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఘోష్ కమీషన్ పేరిట మూడేళ్లుగా కేసీఆర్ పై కక్షగట్టి రాజకీయాలు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టులాంటిందన్నారు.
పీసీ ఘోష్ కమీషన్ కాదని పీసీసీ నివేదిక అని బీఆర్ఎస్ పార్టీ చెప్పిందే నిజమైందని హైకోర్టు తీర్పుతో తేటతెల్లమైందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మేడిగడ్డ మాత్రమే కాదని, బరాజ్ లు, ఎన్నో కాలువలు, సారంగాలు, పంప్ హౌస్ ల సమాహారమని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద కుంగిన పిల్లర్లకు సొంత ఖర్చులతో మరమ్మత్తు చేసేందుకు నిర్మాణ సంస్థ ఎల్అండ్ టీ ముందుకు వచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. మూడు, నాలుగు వందల కోట్లు వెచ్చిస్తామని ఒప్పుకున్న బెదిరించి పారిపోయేటట్లు చేశారని ఆరోపించారు.
కాళేశ్వరం బాగుపడితే కేసీఆర్కు పేరు వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి కుట్రలకు తెరలేపాడని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని రూ. లక్ష కోట్లు నీళ్ల పాలయ్యాయని నోటి కొచ్చినట్లు మాట్లాడిన కాంగ్రెస్ నాయకులకు మళ్లీ కాళేశ్వరం ప్రాజెక్టే దిక్కయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారన్నారు. గోదావరి నుంచి వృధాగా పోతున్న నదీ జలాలను ఒడిసిపట్టి బరాజ్ లను నిర్మించి వందల టీఎంసీల నీటిని కాపాడారని చెప్పారు. నిండు ఎండకాలంలోను రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా కేవలం మేడిగడ్డ బారజ్ వద్ద టీఎంసీ నీళ్లు పారుతున్నాయని తెలిపారు. కాళేశ్వరమే రాష్ట్రానికి ప్రాణాధారమని తెలంగాణకు త్రాగునీరు, లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అద్భుతమైన ప్రాజెక్టు అని కొనియాడారు. సీఎం ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మాని కుంగిన రెండు పిల్లర్లకు వెంటనే మరమ్మత్తులు చేయించి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు పణంగా పెట్టి రాజకీయాలు చేయవద్దని సీఎంకు ఎమ్మెల్యే హితవు పలికారు. ఎల్వేనో ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే ఏడాది వర్షపాతం తక్కువగా ఉండబోతుందనే హెచ్చరికలతో సీఎం మేడిగడ్డకు పరిగెత్తుకుంటూ వెళ్లారని ఎద్దేవా చేశారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, పట్టణ మైనార్టి అధ్యక్షుడు ఫహిం, కౌన్సిలర్లు మోసిన్, సురేందర్, మహేష్, నాయకులు మధు, నరేష్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.
Vijayawada Court | కోర్టులో న్యాయవాదులకు తప్పిన ప్రమాదం.. గాలి ఆడక ఇబ్బందులు పడ్డ లాయర్లు
పశువుల కడుపుల్లోకి ప్లాస్టిక్ వ్యర్ధాలు
Viral news | పెళ్లి పీటలపై నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి కొత్త పెళ్లికొడుకు.. Video