Delhi murder case | గేమింగ్ వ్యసనం.. రూ.5 లక్షల అప్పు.. ప్లాన్ ప్రకారమే ఐఆర్ఎస్ కూతురు హత్య
Delhi murder case : ఢిల్లీలో జరిగిన ఐఆర్ఎస్ అధికారి కూతురు హత్య కేసు ఘటనలో నిందితుడు రాహుల్ మీనాను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ కేసు విచారణ సందర్భంగా రాహుల్ నుంచి సంచలన విషయాలు బయటపడుతున్నాయి.
Delhi murder case : ఢిల్లీలో జరిగిన ఐఆర్ఎస్ అధికారి కూతురు హత్య కేసు ఘటనలో నిందితుడు రాహుల్ మీనాను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ కేసు విచారణ సందర్భంగా రాహుల్ నుంచి సంచలన విషయాలు బయటపడుతున్నాయి. బుధవారం ఉదయం దక్షిణ ఢిల్లీలో ఉంటున్న ఐఆర్ఎస్ అధికారి కూతురుపై రాహుల్ మీనా హత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం వారి ఇంట్లోంచి నగదు, బంగారం కూడా దోచుకెళ్లాడు. ఈ నేరానికి పాల్పడటానికి ఒక రోజు ముందు కూడా రాహుల్ మీనా.. రాజస్థాన్లోని తన ఇంటి పక్కన ఉండే స్నేహితుడి భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బాధితురాలిని బెదిరించాడు. అనంతరం అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చి మరో దారుణానికి ఒడిగట్టాడు. నిందితుడు రాహుల్ మీనా పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. అతడికి ఆన్లైన్ గేమింగ్ అలవాటు ఉండేది. అది వ్యసనంగా మారింది. అలాగే, మొత్తంగా రూ.5 లక్షల వరకు అప్పు ఉంది. ఈ నేపథ్యంలో అప్పు తీర్చేందుకు చివరికి తన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా అమ్మేశాడు. అయితే, ఆ డబ్బుతో తిరిగి గేమ్స్ ఆడాడు. ఐఆర్ఎస్ ఇంట్లో రాహుల్ ఏడాదిన్నర కాలంపాటు పని చేశాడు. అప్పుడు అతడికి నెలకు రూ.20,000 వేతనం అందేది. అలాగే, గిఫ్టులు, పండుగల సందర్భంగా బోనస్లు వంటివి కూడా ఇచ్చేవారు. కానీ, అతడికి నెమ్మదిగా ఆన్లైన్ గేమ్స్ అలవాటయ్యాయి. ఆ తర్వాత వ్యసనంగా మారింది. చివరకు గేమ్స్ వల్ల అప్పులపాలయ్యాడు. తన అసవరాల కోసం షాపుల దగ్గరి నుంచి సరుకులు అప్పు తెచ్చుకునేవాడు. ఇది గుర్తించిన ఐఆర్ఎస్ ఆఫీసర్ అతడిని ఈ వ్యసనం గురించి హెచ్చరించాడు. అయినప్పటికీ అప్పులు చేయడం, గేమ్స్ ఆడటం వంటివి మానకపోవడంతో అతడిని పనిలోంచి తీసేశారు.
అప్పటికి అతడికి దాదాపు రూ.5 లక్షల అప్పైంది. ఈ కారణంతోనే అతడు తనకు పని కల్పించిన ఐఆర్ఎస్ ఇంటిని టార్గెట్ చేసుకున్నాడు. ఆ ఇంటిలోకి వెళ్లిన రాహుల్.. అత్యంత దారుణంగా నేరానికి పాల్పడ్డాడు. యువతిపై దాడి చేసి, ఆపై అత్యాచారం చేశాడు. ఆ ఇంట్లోని నగదు, డబ్బులు తీసుకున్న అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. అతడిని పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ కోర్టు నిర్ణయం తీసుకుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

