‘వేసవిలో పిల్లలను బయట తిరగనీయొద్దు’
వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలను తల్లిదండ్రులు బయట తిరగనీయకుండా చూడాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖాధికారి బి.నాగలక్ష్మి అన్నారు. గురువారం బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్(ప్రైమరీ స్కూల్)తో పాటు కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని..
– తల్లిదండ్రులకు డీఈఓ బి.నాగలక్ష్మి సూచనలు
బూర్గంపహాడ్, ఏప్రిల్ 23 : వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలను తల్లిదండ్రులు బయట తిరగనీయకుండా చూడాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖాధికారి బి.నాగలక్ష్మి అన్నారు. గురువారం బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్(ప్రైమరీ స్కూల్)తో పాటు కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఈఓ యదుసింహరాజుతో కలిసి పాఠశాలలో వసతులు, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. టాయిలెట్స్, కిచెన్ షెడ్, తరగతి గదులను తనిఖీ చేశారు. అనంతరం మండల ప్రాథమిక పాఠశాల(ప్రైమరీ స్కూల్)లో తల్లిదండ్రులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వేసవి సెలవులు కావడంతో పిల్లలను ఇంటి పట్టున ఉంచి కొద్దిసేపు చదివించాలని, బయట తిరగకుండా చూడాలని, సెల్‌ఫోన్, టీవీ వంటి వాటికి దూరంగా ఉంచాలని సూచించారు. అంతేకాకుండా ఈత పేరుతో సమీపంలోని వాగులు, నదుల వద్దకు పోనీయకుండా తల్లిదండ్రులు పిల్లలను నిత్యం పర్యవేక్షించాలన్నారు. అనంతరం పిల్లలకు ప్రోగెస్ రిపోర్టులు అందించి మార్కుల్లో ప్రతిభ కనబర్చినందుకు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం శేషగిరిరావు, కేజీబీవీ స్పెషలాఫీసర్ సుశీల, ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

