విద్యార్థుల కోసం సమ్మర్ కోచింగ్ క్లాసుల నిర్వహణ : జీఎం శాలెం రాజు
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో విద్యార్థుల కోసం సమ్మర్ కోచింగ్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు తెలిపారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
రుద్రంపూర్ , ఏప్రిల్ 23 : సింగరేణి కొత్తగూడెం ఏరియాలో విద్యార్థుల కోసం సమ్మర్ కోచింగ్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు తెలిపారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 18 సంవత్సరాల లోపు బాల బాలికలకు ఈ కోచింగ్ తరగతులు ఏప్రిల్ 27 నుండి మే 21 వరకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహించబడతాయన్నారు. విద్యార్థులకు ప్రాథమిక అంశాలతో పాటు మెరుగైన మార్గదర్శకత్వం అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
నాలుగు కేంద్రాల్లో తరగతుల నిర్వహణ
ఫుట్ బాల్, సాధన గ్రౌండ్స్, రామవరం
వాలీబాల్, ప్రొ.జయశంకర్ స్టేడియం, గౌతంపూర్
అథ్లెటిక్స్, ప్రొ.జయ శంకర్ స్టేడియం, గౌతంపూర్
కిక్ బాక్సింగ్, రెస్క్యూ గ్రౌండ్స్, 3 ఇంక్లయిన్ ప్రాంతాల్లోని గుర్తించిన కేంద్రాల్లో ఈ శిక్షణ కొనసాగనున్నట్లు వెల్లడించారు. ఉదయం 6.00 గంటల నుండి 8.00 గంటల వరకు అలాగే సాయంత్రం 5.00 గంటల నుండి 6.30 గంటల వరకు క్లాసుల నిర్వహణ ఉంటుందన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, సమీప కేంద్రాలలో సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమ్మర్ కోచింగ్ ద్వారా విద్యార్థుల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

