Revanth vs Surekha | టీ కాంగ్రెస్‌లో రాజుకున్న అగ్గి..! రెండు గ్రూపులుగా విడిపోయిన సీఎం రేవంత్, మంత్రి కొండా సురేఖ
Congress | తెలంగాణ కాంగ్రెస్‌లో (Congress )అగ్గి రాజుకుంది. ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు మంత్రి కొండా సురేఖ(Konda Surekha) ఎపిసోడ్‌తో ముదిరి పాకాన పడ్డాయి.
Congress | తెలంగాణ కాంగ్రెస్‌లో (Congress )అగ్గి రాజుకుంది. ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు మంత్రి కొండా సురేఖ(Konda Surekha) ఎపిసోడ్‌తో ముదిరి పాకాన పడ్డాయి. సురేఖను టార్గెట్ చేస్తూ కొంతకాలంగా రేవంత్ రెడ్డి(CM Revanth reddy) శిబిరం పావులు కదుపుతున్నది. కొన్నిసార్లు అధికారిక కార్యక్రమాలకు సైతం మంత్రి సురేఖకు ఆహ్వానం లేకుండానే పనులు చేస్తున్నారు. కడియం శ్రీహరితో ఇదే విషయంలో పలుమార్లు మంత్రి గొడవ కూడా పడ్డారు. తాజాగా మంత్రి కూతురు కొండా సుస్మిత సీఎం రేవంత్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. రేవంత్ రెడ్డి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాని, వాటిన బయటపెడుతానని హెచ్చరించడంతో రేవంత్ రెడ్డి శిబిరంలో అలజడి మొదలైంది.
కొండా ఫ్యామిలీకి ఎలాగైన చెక్ పెట్టాలని ఉమ్మడ వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలతో స్కెచ్ వేశారు. ఈ క్రమంలో కొండా సురేఖకు వ్యతిరేకంగా, తనకు మద్దతు తెలుపుతూ మీటింగ్ పెట్టమని తన వర్గానికి రేవంత్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో20 నుండి 30 మంది రేవంత్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు సమావేశం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మీటింగ్‌కు ఎవరు వస్తారు? ఎవరు డుమ్మా కొడతారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.
మీటింగ్‌కు వచ్చిన వారు రేవంత్ రెడ్డి వర్గమని, రానివారు అంతా ఒరిజినల్ కాంగ్రెస్ వర్గమని నిర్ధారణకు రావొచ్చంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు తనకు మద్దతు ఇస్తున్న నాయకులకు ఫోన్లు చేసి, మనం కూడా మీటింగ్ పెట్టుకుందామని కొండా సురేఖ సిద్దమవుతున్నట్లు తెలిసింది. అటు సీఎం ఇటు మంత్రి సురేఖ వర్గీయులు రెండు వర్గాలుగా చీలిపోవంతో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Peace Prize: భారత సంతతి మహిళ నవనీతం నావి పిళ్లైకు నోబెల్ శాంతి బహుమతి
Manne Krishank | అనుముల ఫ్యామిలీ కాదు..అనకొండ ఫ్యామిలీ : మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్
NRI | ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ కువైట్ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
Supreme Court | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

