Vande Mataram: వందేమాతరం ఫుల్ వర్షన్.. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య వివాదం
Vande Mataram: ఇండియా కూటమిలోని నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ మధ్య భేదాభిప్రాయాలు మొదలయ్యాయి. వందేమాతరం గీతం ఆ పార్టీల మధ్య వివాదాన్ని సృష్టించింది. కూటమిలో భాగమైన పార్టీ తమకు హుకుం ఇవ్వలేదని ఎన్సీ పేర్కొన్నది.
శ్రీనగర్: ఇండియా కూటమిలోని నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ మధ్య పొలిటికల్ వార్ మొదలైంది. వందేమాతరం గీతం ఆ పార్టీల మధ్య వివాదాన్ని సృష్టించింది. జమ్మూకశ్మీర్‌లో సోమవారం అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఆ సమయంలో వందేమాతర పూర్తి గీతాన్ని ప్లే చేశారు. ఎన్సీ నేతలు సీఎం ఒమర్ అబ్దుల్లా, ఎన్సీ నేత ఫారూక్ అబ్దుల్లా.. ఆ సాంగ్ మొత్తం నిలబడి ఉన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. వందేమాతరం గీతం పూర్తిగా పాడిన సమయంలో నిలబడాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ వెల్లడించింది. తొలి చరణం పాడినప్పుడు మాత్రమే నిలబడి ఉంటే సరిపోతుందన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఓ వీడియోను తన ఎక్స్‌లో పోస్టు చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల స్పూర్తికి విరుద్ధంగా వందేమాతరం సాంగ్ ఫుల్ వర్షన్ ఉందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ విధానానికి కట్టుబడి ఉండాలని ఆయన నేషనల్ కాన్ఫరెన్స్‌ను కోరారు. కేసీ వేణుగోపాల్ వ్యక్తం చేసిన అభిప్రాయాలను నేషనల్ కాంగ్రెస్ తప్పుపట్టింది. కూటమి పార్టీలకు కాంగ్రెస్ ఆదేశాలు ఇవ్వడం సరికాదు అని ఎన్సీ పేర్కొన్నది.
మరో వైపు కాంగ్రెస్ వ్యవహరించిన తీరును ముస్లింగ్ లీగ్‌గా పేర్కొంటూ బీజేపీ ఆరోపణలు చేసింది. కూటమిలో భాగస్వామికి హుకుం జారీ చేయడం సరికాదు అని, వేణుగోపాల్‌కు ట్వీట్ చేసే హక్కు ఉందని, కానీ దాన్ని తమపై రుద్దే అధికారం లేదని, ఇది ప్రజల ఇష్టం అని, ప్రజలపై ఆంక్షలు విధిస్తే తాము వ్యతిరేకిస్తామని ఎన్సీ నేత బాషిర్ అహ్మద్ తెలిపారు.
The full version of Vande Mataram sits uneasily with the syncretic and pluralist ethos that our freedom fighters envisioned and nurtured for India.
For us, the considered judgment of Mahatma Gandhi, Pandit Nehru, Sardar Patel, Subhash Chandra Bose, Rajendra Prasad, Acharya… pic.twitter.com/VngmVUmevz
— K C Venugopal (@kcvenugopalmp) September 8, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

