Lawrence Wong | ప్రపంచంలో అత్యధిక వేతనం తీసుకుంటున్న ప్రధాని ఆయనే..!
Lawrence Wong | ప్రపంచంలోని వివిధ దేశాల ప్రధానుల వేతనాలను పరిశీలిస్తే వారి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. వారిలో సింగపూర్ ప్రధాని (Singapore Prime Minister) లారెన్స్ వాంగ్ (Lawrence Wong) వేతనం అత్యధికంగా ఉన్నది. ఇప్పుడు ఆయన జీతం ఇంకా పెరగనున్నట్లు తెలుస్తున్నది. రాజకీయ నేతల (Political leaders) వేతనాలను పెంచుతున్నట్లు ఆయన మంగళవారం పార్లమెంటులో ప్రకటించారు.
Lawrence Wong : ప్రపంచంలోని వివిధ దేశాల ప్రధానుల వేతనాలను పరిశీలిస్తే వారి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. వారిలో సింగపూర్ ప్రధాని (Singapore Prime Minister) లారెన్స్ వాంగ్ (Lawrence Wong) వేతనం అత్యధికంగా ఉన్నది. ఇప్పుడు ఆయన జీతం ఇంకా పెరగనున్నట్లు తెలుస్తున్నది. రాజకీయ నేతల (Political leaders) వేతనాలను పెంచుతున్నట్లు ఆయన మంగళవారం పార్లమెంటులో ప్రకటించారు. దాంతో ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్న సింగపూర్ రాజకీయ నేతల జీతాలు మరో 60 శాతానికిపైగా పెరగనున్నాయి.
ప్రస్తుతం ప్రధాని వార్షిక బెంచ్‌మార్క్ వేతనం 2.2 మిలియన్ సింగపూర్ డాలర్లు. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.16.5 కోట్లు. తాజా పెంపుతో ఈ మొత్తం 3.6 మిలియన్ సింగపూర్ డాలర్లకు చేరుతుంది. అంటే సుమారు రూ.27 కోట్లు. మొత్తంగా జీతం దాదాపు రూ.10.5 కోట్లు పెరగనుంది. డిప్యూటీ ప్రధాని వేతనం 1.87 మిలియన్ సింగపూర్ డాలర్ల నుంచి 3.06 మిలియన్ డాలర్లకు పెరుగుతుంది. అంటే ప్రస్తుతం సుమారు రూ.14 కోట్లుగా ఉన్న జీతం రూ.23 కోట్లకు చేరనుంది.
క్యాబినెట్ మంత్రులకు 1.80 మిలియన్ నుంచి 2.88 మిలియన్ సింగపూర్ డాలర్ల వరకు చెల్లిస్తారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.13.5 కోట్ల నుంచి రూ.21.6 కోట్ల వరకు ఉంటుంది. తనకు పెరిగే మొత్తాన్ని పదవీకాలంలో వివిధ కార్యక్రమాలకు విరాళంగా ఇస్తానని వాంగ్ తెలిపారు. రాజకీయ నేతల జీతాల పెంపు ప్రజల్లో భావోద్వేగపూరిత అంశమని ఆయన అన్నారు. సామాన్యుల ఆదాయంతో పోలిస్తే ఈ జీతాలు చాలా ఎక్కువగా ఉండటంతో ప్రజలు వాటిని నిశితంగా పరిశీలించడం సహజమేనని చెప్పారు.
మంచి పాలనకు సమర్థ నాయకత్వం అవసరమని వాంగ్ తెలిపారు. భవిష్యత్తులో దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు నాణ్యమైన నాయకత్వాన్ని కొనసాగించడమే లక్ష్యమని వివరించారు. మంత్రి వేతనాల పెంపు స్వతంత్ర కమిటీ సిఫార్సుల మేరకు జరిగింది. అయితే కొత్త వేతనాలను ప్రస్తుత పదవుల్లో ఉన్నవారికి వెంటనే వర్తింపజేయరు. అక్టోబర్ 15 నుంచి వ్యక్తిగత పరిస్థితులు, పనితీరును బట్టి గరిష్ఠంగా 9 శాతం వరకు ఒకేసారి సర్దుబాటు చేస్తారు. ఇకపై జీతాల్లో మార్పులు.. పనితీరు, బాధ్యతల ఆధారంగానే ఉంటాయని వాంగ్ చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

