NBK 112 | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘దేవర’ తర్వాత కొరటాల శివ రూపొందించనున్న ఈ చిత్రం బాలయ్య కెరీర్లో మరో ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పలు ఆసక్తికరమైన వార్తలు ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ ఈ సినిమాలో ఇప్పటివరకు చూడని సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నారనే టాక్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. బాలకృష్ణను మాస్ యాక్షన్ హీరోగా అద్భుతంగా ప్రెజెంట్ చేయడంలో దర్శకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంటారు. అయితే కొరటాల శివ మాత్రం ఈసారి బాలయ్యను కేవలం మాస్ యాంగిల్‌కే పరిమితం చేయకుండా.. ఆయన పాత్రలో కొత్త షేడ్స్‌ను చూపించనున్నారని టాక్ వినిపిస్తోంది.
సామాజిక అంశాలు, కుటుంబ భావోద్వేగాలను కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మేళవించడం కొరటాల శివ శైలి. ఈ సినిమాలోనూ అదే తరహాలో యూనివర్సల్ ఎమోషన్‌తో కూడిన కథను సిద్ధం చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ భారీ చిత్రానికి సంబంధించిన తొలి షూటింగ్ షెడ్యూల్ అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే మొదటి షెడ్యూల్లో బాలకృష్ణ పాల్గొనరనే టాక్ వినిపిస్తోంది.బాలయ్య లేకుండా కీలకమైన సన్నివేశాలతో పాటు భారీ యాక్షన్ ఎపిసోడ్లను చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రత్యేకంగా భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.దాదాపు 15 రోజుల పాటు హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై కొంతకాలంగా ఆసక్తి కొనసాగుతోంది. తాజాగా మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి పేరును దాదాపు ఖరారు చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.వైద్యురాలిగా పనిచేసిన ఐశ్వర్య లక్ష్మి.. నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చి మలయాళం, తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ప్రస్తుతం సాయిదుర్గా తేజ్ నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’లోనూ ఆమె కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ సరసన నటించే అవకాశం దక్కితే ఆమె కెరీర్‌కు ఇది మరో కీలక మలుపుగా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.ఈ సినిమాలో మరో కీలకమైన పాత్ర కోసం నటి ఐశ్వర్య రాజేష్ పేరు కూడా వినిపిస్తోంది. ఆమెను రెగ్యులర్ హీరోయిన్ పాత్రలో కాకుండా లేడీ విలన్‌గా సరికొత్త నెగెటివ్ షేడ్‌లో చూపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే హీరోయిన్, లేడీ విలన్ పాత్రలకు సంబంధించిన ఈ వివరాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.