హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) దూసుకుపోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రతి రోజు మూడు నుంచి నాలుగు నియోజవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు (Praja Ashirvada Sabha) నిర్వహిస్తున్నారు. గత తొమ్మిదిన్నరేండ్లలో ప్రభుత్వం అమలుచేసిన పథకాలను వివరించడంతోపాటు బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 25న హైదరాబాద్ సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో (Parade Ground) భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని నియోజకర్గాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఈ సభకు తరలిరానున్నారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికే ప్రారంభించారు. ఇందులో భాగంగా పరేడ్ గ్రౌండ్లో సభ నిర్వహణకు రక్షణ శాఖ అనుమతించింది. దీంతో సభ ఏర్పాట్లను ముమ్మరం చేయనున్నారు.