CM KCR Press Meet | రాష్ట్రంలో వరి సాగు లేదని కేంద్రం అవమానించిందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రగతి భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వర్షాకాలంలో పండే పంట తక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు చేతికి అందుతుందని.. నూక తక్కువ వస్తుందని.. మిల్లర్లకు ఇబ్బంది ఉండదన్నారు. తెలంగాణ ప్రాంతంలో యాసంగిలో పండే పంటకు ఫిబ్రవరి 20 తర్వాత ఫ్లవరింగ్ వస్తేనే ధాన్యం వస్తుందని.. లేకుంటే తాలైపోతుందన్నారు. ఫిబ్రవరి 20 తర్వాత రాష్ట్రంలో వేడి పెరుగుతుందని, మార్చి.. ఏప్రిల్ వరకు కోతలు జరుగుతాయని, ఆ సమయానికి 35 డిగ్రీలు దాటిపోతుందని, అప్పుడు నూక అవుతుందన్నారు.
దేశంలో బాయిల్డ్ రైస్ వినియోగం ఉంది కాబట్టి.. దాన్ని మిల్లర్లు బాయిల్ చేసి ఇస్తారని.. వాటిని రేషన్ దుకాణాల కింద రాష్ట్రాలకు కేంద్రమే కేటాయింపులు చేస్తుందన్నారు. ఈ క్రమంలో బాయిల్ రైస్ తీసుకొని.. రాష్ట్రాలకు పంపేదన్నారు. ప్రస్తుతం వాటిని తీసుకోమని నిరాకరిస్తున్నారన్నారు. తెలంగాణలో యాసంగి సాగంటే బాయిల్ రైసే అన్నారు.. మామూలు రైస్ రాదన్నారు. వర్షాకాలం రా రైస్ వస్తాయన్నారు. గత సంవత్సరం 80శాతం బాయిల్ రైస్ ఇవ్వాలని, 20 శాతం మామూలు రైస్ ఇస్తే అన్లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటామని ఎఫ్‌సీఐ జనరల్ మేనేజర్.. తెలంగాణ సివిల్ సప్లయ్ కమిషనర్‌కు లేఖ రాశారన్నారు. 50లక్షల టన్నుల బాయిల్ రైస్‌కు ఒప్పందం చేసి.. ఇచ్చారన్నారు.
కానీ.. తీరా 24లక్షల టన్నులు తీసుకొని.. మిగతావి తీసుకోమని మెలికపట్టారన్నారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సమయంలో ధాన్యం విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లే.. భవిష్యత్‌లో బాయిల్డ్ రైస్ ఇవ్వమని రాతపూర్వకంగా ఇవ్వాలని.. ఇస్తేనే రాష్ట్రం వద్ద ఉన్న ధాన్యం తీసుకుంటామని చెప్పిందన్నారు. ఈ పరిస్థితుల్లో చేసేది ఏమీ లేక.. కేంద్రం కోరినట్లు రాసి ఇచ్చినట్లు చెప్పారు. అయినా, ఇంకో 5లక్షల టన్నులు ధాన్యం కేంద్రం తీసుకోలేదని, మొదట 24లక్షల టన్నులు, ఆ తర్వాత 20లక్షల టన్నులు తీసుకున్నదన్నారు. ప్రస్తుతం 5లక్షల టన్నులు రాష్ట్రం వద్ద గత యాసంగి ధాన్యం మిగిలిపోయిందన్నారు. ఇంకా ఆ ధాన్యం పరిస్థితి ఏంటో కేంద్రం తేల్చలేదన్నారు.
ఈ సమస్య కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. ఈ విషయాన్ని కేంద్రం మంత్రి దృష్టికి తీసుకెళ్లే.. పరిశీలిస్తామని చెప్పారని, ఇంకా పెండింగ్‌లో ఉందన్నారు. ఈ ఏడాది ధాన్యం సేకరణపై కేంద్రమంత్రి, ఎఫ్‌సీఐ అధికారులతో స్పష్టమైన అవగాహన కోసం మరో రోజు సమావేశం జరిగిందన్నారు. ఆ మరుసటి రోజు జరిగిన సమావేశంలో కేంద్రమంత్రి ఇంత ధాన్యం తీసుకునే పరిస్థితి లేదని, ఎంతో కొంత నిర్ణయించి రాష్ట్రానికి సమాచారం ఇస్తామని చెప్పారని.. ఇప్పటి వరకు ఎంత ధాన్యం తీసుకునేది చెప్పలేదన్నారు. వర్షాకాలంలో 62లక్షల పైచీలుకు ఎకరాల్లో వరి సాగైందని.. వరి కోతలు ప్రారంభమయ్యాయన్నారు. ప్రస్తుతం చెప్పిన ధాన్యం తీసుకునే పరిస్థితి లేదన్నారు.
సుమారు 1.70లక్షల టన్నుల వరకు వడ్లు వస్తాయని, 1.10లక్షల టన్నుల దాకా బియ్యం వస్తాయన్నారు. దాన్ని తీసుకునే దిక్కే లేదని.. కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం నుంచి లేఖలు రాలేదన్నారు. మూడు నాలుగు రోజల కిందట కేంద్ర మంత్రితో మాట్లాడనని, తాను విదేశి పర్యటనలో ఉన్నానని, ఒకటి రెండు రోజుల్లో చెబుతానని చెప్పి.. ఇంకా సమాధానం ఇవ్వలేదన్నారు. లేకపోగా మీ వద్ద 62లక్షల ఎకరాల్లో వరి పంట లేనట్టుంది.. శాటిలైట్ పిక్చర్ చూపిస్త లేదని రాష్ట్రాన్ని కించపరిచే మాటలు మాట్లాడరన్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇది పద్ధతి కాదని.. ధాన్యం తీసుకోమంటే తీసుకోమని.. తీసుకుంటే తీసుకుంటామని చెప్పాలని డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం లేని వరిని ఉన్నట్లు చెబుతామా? అని ప్రశ్నించానన్నారు. ఈ విపత్కర పరిస్థితులపై ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లోనూ స్పష్టంగా రైతాంగానికి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. యాసంగిలో ఎలాంటి పంటలు వేయాలో ప్రభుత్వం వివరిస్తుందని నవంబర్‌లో వివరిస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై ఎలాంటి స్పందన లేదని, బాయిల్డ్ బియ్యం తీసుకోమని వైఖరిని స్పష్టం చేసిందని.. ఈ పరిస్థితుల్లో రైతులు వరి పంట వేస్తే రైతులు నష్టపోతారని.. అమ్ముడు పోదని.. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయజాలదన్నారు. కేంద్రం తీసుకోని పరిస్థితుల్లో రాష్ట్రం తీసుకొని ఏం చేస్తుందన్నారు.
ఈ తరుణంలో గత కొద్ది రోజులుగా మంత్రులతో సమీక్షించి.. ఏయే పంటలకు అనుకూలంగా ఉంటుంది? శాస్త్రవేత్తలను పిలిచి మాట్లాడామన్నారు. కొన్ని రకాల విత్తనాలు రాష్ట్రంలో అందుబాటులో లేకుంటే తెప్పించామన్నారు. నువ్వులు, ఆవాలు, పల్లికాయ తదితర తొమ్మిది రకాల పంటలు సాగుకు అనుకూలమని.. వరి కంటే లాభం వచ్చే పంటలున్నాయన్నారు. కరెంటు తెచ్చాం, నీళ్లు తెచ్చాం.. భూగర్భ జలాలు పెంచాం.. పెట్టుబడి ఇస్తున్నాం.. రైతాంగం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, రాష్ట్రంలో వ్యవసాయ స్థీకరణ జరిగిందన్నారు. రైతులు నష్టపోకుండా కాపాడుకోవాలని ఇతర పంటలు సాగు చేయాలని చెప్పినట్లు చెప్పారు.
ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన చేశారన్నారు. ఒక స్పష్టమైన అవగాహనతోనే రైతులు గత్తరబిత్తర కాకుండా ఉండేందుకు, ఆత్మహత్యలు చేసుకొని ఆగమైన తెలంగాణ రైతాంగాన్ని ఏడు సంవత్సరాల అవిరాళ కృషి ద్వారా.. అనేక పటిష్టమైన చర్యల ద్వారా ఓ దరికి తెచ్చామన్నారు. ఇవాళ గ్రామాల్లో సంతోషం ఉందని.. నీళ్లు వస్తున్నాయని.. పంటలు బాగా పండుతున్నాయన్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేశామని.. స్థిరీకరణతో రైతులు ఆశావాద దృక్పథంతో వైపు వెళ్తున్నారన్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం లేదని, పెట్టుబడి సకాలంలో ఇవ్వడం ద్వారా రుణాలు తీసుకోవడం లేదని.. చిన్న రైతులకు రుణాలు తీసుకునే అవసరం లేకుండా పోతుందన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
CM KCR : పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం చేస్తున్న మోసాన్ని ఆధారాలతో సహా నిరూపించిన సీఎం కేసీఆర్
CM KCR Press meet | కేంద్రం తీరుపై విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్..
CM KCR : ఢిల్లీ బీజేపీది ఒక మాట.. సిల్లీ బీజేపీది మరో మాట.. ఎవరిని నమ్మాలి : సీఎం కేసీఆర్
కేంద్రం వరి సాగు లేదని అవమానించింది : సీఎం కేసీఆర్
CM KCR : బెస్ట్ కంట్రిబ్యూటింగ్ స్టేట్స్లో తెలంగాణ నెంబర్ వన్ అని చెప్పిన ఆర్బీఐ : కేసీఆర్
నకిలీ విత్తనాలపై పీడీయాక్ట్ తెచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ