బాల్కొండ( ముప్కాల్ ): స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు వేతనాలు పెంచడాన్ని హర్షిస్తూ శనివారం బాల్కొండ ఎంపీడీవో కార్యాలయం ఎదుట సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ లావణ్య లింగాగౌడ్, ఎంపీటీసీలు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలను ఆర్థికంగా ఆదుకుంటున్నారని తెలిపారు.
ఎంపీపీ, ఎంపీటీసీల నెలసరి వేతనాలు పెంచినందుకు సంతోషంగా ఉందని తెలిపారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్, ఎంపీటీసీలు ఇపి నారాయణ, ఏనుగులు రాంరాజ్గౌడ్, కన్న లింగన్న తదితరుల పాల్గొన్నారు.